Watch Video: పిచ్చి పరాకాష్టకు చేరడమంటే ఇదే.. గేదెపై నిలబడి ఈమె చేస్తున్న పని చూడండి..
ABN, Publish Date - Aug 12 , 2025 | 09:25 PM
వ్యూస్, లైక్‌ల కోసం మహిళలు విచిత్రంగా ప్రవర్తించం చూస్తున్నాం. కొందరు చెట్టుపై నిలబడి డాన్స్ చేస్తే.. మరికొందరు రైలుపై నడుస్తూ వీడియోలు తీస్తుంటారు. తాజాగా ఓ మహిళ ఎలాగైనా వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు..
ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో రీల్స్ పిచ్చి లేని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ రీల్స్ చేయడం పనిగా పెట్టుకుంటున్నారు. కొందరు నిత్యం ఇదే పనిలో ఉంటున్నారు. వ్యూస్, లైకులు వస్తే సంతోషపడడం, రాకపోతే బాధపడడం పరిపాటిగా మారిపోయింది. కొందరు ఎలాగైనా నెట్టింట వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేస్తున్నారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ గేదెపై నిలబడి చేసిన నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వ్యూస్, లైక్‌ల కోసం మహిళలు విచిత్రంగా ప్రవర్తించం చూస్తున్నాం. కొందరు చెట్టుపై నిలబడి డాన్స్ చేస్తే.. మరికొందరు రైలుపై నడుస్తూ వీడియోలు తీస్తుంటారు. తాజాగా ఓ మహిళ ఎలాగైనా వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు గేదెపై డాన్స్ చేయాలని నిర్ణయించుకుంది. ఇంటి బయట గెదెను కట్టేసి, దాని ముందు, వెనుక ఇద్దరు నిలబడి కదలకుండా పట్టుకున్నారు.
తర్వాత మహిళ గేదె పైకి ఎక్కి నిలబడింది. గెదెపై నిలబడి డాన్స్ చేస్తూ కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ఇలా ఆమె చాలా సేపు గేదెపై నిలబడి (Woman dancing on buffalo) డాన్స్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గేదె పరుగులు తీసి ఉంటే.. ధబేల్‌మని కిందపడి ఉండేది. అయితే తమ స్వార్థం కోసం ఇలా గేదెను హింసించడం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘రీల్స్ పిచ్చి కోసం గేదెను హింసించడం దారుణం’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పిచ్చి పనులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 230కి పైగా లైక్‌లు, 31 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..
ప్రియురాలి అత్యుత్సాహం.. రెండో అంతస్తులో పరుగెత్తుకుంటూ రావడంతో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Aug 12 , 2025 | 09:25 PM