Woman Hurling Racial Slurs: అమెరికాలో షాకింగ్.. మహిళపై జాత్యాహంకారపూరిత వ్యాఖ్యలు
ABN, Publish Date - Apr 17 , 2025 | 05:52 PM
అమెరికాలో మరోసారి జాత్యాహంకార పోకడలు వెలుగు చూసాయి. ఓ శ్వేతజాతీయేతర మహిళ మరో మహిళను జ్యాత్యాహంకార వ్యాఖ్యలతో దారుణంగా అవమానించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో జాత్యాహంకార ఘటనలు తరచూ వెలుగు చూడటం స్థానికులకు కూడా ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ మహిళ శ్వేత జాతీయేతరురాలైన మరో మహిళను దారుణంగా అవమానించడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాలిఫోర్నియాలోని పినోల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కారులో కూర్చొన్న ఓ మహిళ, బయటనిలబడ్డ మరో మహిళ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కారులోని మహిళ జాత్యాహంకారాన్ని ప్రదర్శిస్తూ బయట ఉన్న మహిళను దారుణంగా అవమానించంది. నీగ్రో అంటూ నోటికొచ్చినట్టు తిట్టిపోసింది. పదే పదే నీగ్రో అంటూ ఆమెను తిట్టిపోసింది. తనను కెమెరాలో రికార్డు చేస్తున్నారని తెలిసినా ఆమె వెనక్కు తగ్గకపోవడం గమనార్హం.
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాటి మనిషిని ఇంతలా ఎలా అవమానిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఈ ఉదంతంపై సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘అసలు ఆమెను అంత మాట ఎలా అనగలిగింది. ఒకవేళ కారు బయట ఉన్న మహిళే తొలుత అవమానంగా మాట్లాడినట్టైతే కారులోని మహిళ కేవలం తన అవమానంపై ప్రతిస్పందిస్తున్నట్టే’’ అని మరో వ్యక్తి అన్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు ఇంకా ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు.
ఇటీవల ఫ్లోరిడాలో వెలుగు చూసిన మరో ఘటనలో ఓ శ్వేతజాతీయురాలు నల్లజాతి మహిళపై ఉమ్మేయడమే కాకుండా ఆమెను చంపేస్తానంటూ బెదిరించింది. స్కూల్ వార్షికోత్సవంలో సీట్ల విషయంలో తలెత్తిన వివాదంలో శ్వేత జాతి మహిళ దారుణ జాత్యాహంకారం ప్రధ్నవించింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. వారి మధ్య వాదులాటు చూస్తుండగానే పతాకస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో శ్వేత జాతీయురాలు తన దుర్భుద్ధిని ప్రదర్శించింది. వరుస ఘటనల నేపథ్యంలో అమెరికాలో జాత్యాహంకార ధోరణిపై మరోసారి చర్చ మొదలైంది. ఇలాంటి వారిపై వేగంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినబడ్డాయి.
ఇవి కూడా చదవండి:
అమెరికాలో వింత రేసు.. వీర్య కణాల మధ్య పరుగుపందెం.. భారీ స్థాయిలో ఏర్పాట్లు
జాబ్‌లో మజా లేదని యువతి రాజీనామా.. షాక్‌లో సంస్థ యజమాని
ట్రెయిన్ టిక్కెట్టు పోగొట్టుకున్న సందర్భాల్లో ఏం చేయాలంటే..
Updated Date - Apr 17 , 2025 | 05:52 PM