Share News

Gen Z resignation: జాబ్‌‌లో మజా లేదని యువతి రాజీనామా.. షాక్‌లో సంస్థ యజమాని

ABN , Publish Date - Apr 17 , 2025 | 03:11 PM

జాబ్‌లో మజా రావట్లేదంటూ ఉద్యోగంలో చేరిన రెండో రోజే ఓ యువతి రాజీనామా చేయడం నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది. సంస్థ వైస్‌ప్రెసిడెంట్ స్వయంగా లింక్డ్‌‌‌ఇన్‌లో దీన్ని షేర్ చేశారు.

 Gen Z resignation: జాబ్‌‌లో మజా లేదని యువతి రాజీనామా.. షాక్‌లో సంస్థ యజమాని
Gen Z Resignation

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగాలు చేసే చాలా మంది ఒళ్లుదగ్గర పెట్టుకుని పనిచేస్తారు. పైఅధికారులతో మాట రాకుండా జాగ్రత్త పడతారు. ఉద్యోగాన్ని నిలబెట్టుకునేందుకు అహరహం శ్రమిస్తారు. అయితే, కొత్త తరం మాత్రం కాస్త భిన్నంగా ఆలోచిస్తోంది. ఉద్యోగంతో జీవనోపాధి అని తెలిసినా చేసే పని నచ్చకపోతే నిర్మొహమాటంగా గుడ్‌బై చెప్పేస్తోంది. అయితే, తమకేమి కావాలో కూడా తెలీని స్థితిలో కూర్చున్న కొమ్మను నరుక్కునే యువత తీరు మాత్రం ఆందోళనకారకమే. ఇలాంటి ఓ యువతి ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఉద్యోగంలో చేరిన రెండో రోజే ఓ యువతి గుడ్‌బై చెప్పడం సంస్థ యజమానికి భారీ షాక్ మిగిల్చింది.

జెన్ జీ తరం (1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారు) తీరుకు అసలైన ఉదాహరణగా నిలుస్తున్న ఓ యువతి ఉదంతాన్ని ఆమెకు జాబ్ ఇచ్చి చేతులు కాల్చుకున్న సంస్థ యజమానురాలు లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు.


అసలేం జరిగిందో చెబుతూ ధురీనా సంస్థ వైస్‌ ప్రెసిడెంట్ మాయా శర్మ ఈ పోస్టు పెట్టారు. ఉద్యోగంలో చేరిన రెండో రోజే ఆ ఉద్యోగి మజా రావట్లేదంటూ జాబ్‌కు గుడ్‌బై చెప్పినట్టు తెలిపారు.

‘‘ఇటీవలే ఓ యువతిని జాబ్‌లోకి తీసుకున్నాము. సీనియర్ ఉద్యోగితో రెండు రోజుల పాటు శిక్షణ ఇప్పించాము. గూగుల్ షీట్స్ షార్ట్ కట్ మొదలు అన్నీ నేర్పించాము. ఏప్రిల్ 2న తొలిసారిగా ఆమె సంస్థలో విధులు నిర్వర్తించింది. ఆ తరువాత ఓ మీటింగ్ జరిగింది. సంస్థ ఆర్థిక పురోగతి గురించి ఇందులో చర్చించాము. లక్ష్యాలను చేరుకున్నందుకు టీమ్ సభ్యులను అభినందించాము. ఆ తరువాత స్నాక్స్, కూల్ డ్రింక్స్ అరేంజ్ చేశాము. కానీ ఆ తరువాతే యువతి ఊహించని షాకిచ్చింది’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

రెండో రోజు యువతి హెచ్‌ఆర్‌కు తను రాజీనామా చేస్తున్నట్టు మెయిల్ చేసిందని అన్నారు. జాబ్‌లో మజా రావాట్లేదని ఈమెయిల్‌‌లో ఆమె చెప్పిందని తెలిపారు. ఈ ఈమెయిల్ చూసి తామంతా షాకయ్యామని, అసలు ఆమెకు ఏం కావాలో అర్థం కాలేదని అన్నారు.


ఈ ఉదంతంపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువతలో చాలా మంది ఇలాగే తయ్యారయ్యారని కొందరు అన్నారు. మరికొందరేమో యువ ఉద్యోగిని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. నచ్చని ఉద్యోగాన్ని కాదనుకునే ధైర్యం నేటి తరానికి ఉందని కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

గుండె లోతుల్లోంచి పొంగుకొచ్చిన ఆవేదన.. ఈ రాజీనామా లేఖ చూస్తే..

ట్రెయిన్ టిక్కెట్టు పోగొట్టుకున్న సందర్భాల్లో ఏం చేయాలంటే..

వృద్ధుడిని చీదరించుకుంటున్న జనం.. ఇతడు ఏం చేశాడో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Apr 17 , 2025 | 03:17 PM