Share News

World's First Sperm Race: అమెరికాలో వింత రేసు.. వీర్య కణాల మధ్య పరుగుపందెం.. భారీ స్థాయిలో ఏర్పాట్లు

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:14 PM

ప్రపంచంలోనే తొలి వీర్య కణాల రేసు అమెరికాలో త్వరలో నిర్వహించనున్నారు. పురుషుల ఆరోగ్యం, సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్పర్మ్ రేస్ సంస్థ లాస్‌ఏంజిలిస్‌లో ఈ రేసు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

World's First Sperm Race: అమెరికాలో వింత రేసు.. వీర్య కణాల మధ్య పరుగుపందెం.. భారీ స్థాయిలో ఏర్పాట్లు
World's First Sperm Race

ఇంటర్నెట్ డెస్క్: పరుగు పందెం గురించి విన్నాం.. గుర్రాలు, ఒంటెల రేసుల గురించీ తెలుసు. ఇక కార్లు, బైక్ రేసులు సరేసరి. మరి వీర్య కణాల రేసు గురించి ఎప్పుడైనా విన్నారా? షాకయ్యారు కదూ. కాదేదీదీ పోటీకి అనర్హం అన్నట్టు ఈ వింత రేసు త్వరలో అమెరికాలో జరగనుంది. క్రికెట్, ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లాగే ఈ పోటీని వీక్షించేందుకు వందల మంది హాజరు కానున్నారట.

ఏమిటీ వీర్య కణాల రేసు

వాస్తవానికి ప్రకృతిలో ఈ రేసు సహజసిద్ధంగా జరిగేదే. ఆడ జీవి పునరుత్పత్తి వ్యవస్థలోకి చేరిన వీర్య కణాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ అండం వైపు దూసుకుపోతాయి. మొదటగా అండాన్ని చేరుకున్న వీర్య కణంతో ఫలదీకరణ తరువాత పిండం రూపు దిద్దుకుంటుంది. ఆడ జీవి పునరుత్పత్తి వ్యవస్థలోని రసాయనాలు, హార్మొ్న్లు వీర్య కణాలను ఈ పోటీకి ప్రేరేపిస్తాయి. అండాన్ని వెతుక్కుంటూ దూసుకుపోయేలా చేస్తాయి. ఇదే సీన్‌ను మైక్రోస్కోప్ కింద పునఃసృష్టించి రేసు నిర్వహించాలని స్పెర్మ్ రేసింగ్ అనే సంస్థ నిర్ణయించింది.


పోటీ ఇలా..

లాస్ ఏంజిలిస్‌లో గల హాలీవుడ్‌ పలాడియమ్‌లో ఏప్రిల్ 25న స్పెర్మె రేసింగ్ కంపెనీ ఈ పోటీలకు ఏర్పాట్లు చేస్తోంది. ఫుట్‌బాల్, బేస్‌బాల్ లాంటి క్రీడా ఈవెంట్ల తరహాలో కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ రేసును వీక్షించేందుకు దాదాపు 1000 మంది వస్తారని ఓ అంచనా. రేసు కోసం మైక్రోస్కోప్ కింద 20 సెంటీమీటర్ల ట్రాక్ ఏర్పాటు చేస్తారు. ఆడ జీవి పునరుత్పత్తి అవయవాల్లోని వాతావారణాన్ని పోలీనట్టు ఉండేలా ట్రాక్ సిద్ధం చేస్తారు. రేసులో దూసుకుపోయే వీర్య కణాల దృశ్యాలను మైక్రోస్కోప్ ద్వారా బంధించి అందరికీ కనబడేలా ప్రసారం చేస్తారు. ఈ పోటీలో లైవ్ కామెంటరీ, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు కూడా ఉంటాయి. వీక్షకులు పందేలు కాసే అవకాశం కూడా ఉంటుందట. ఈ రేసు కోసం స్పర్మ్ రేసు సంస్థ ఇప్పటికే రూ.8 కోట్ల వరకూ నిధులు సేకరించింది.


ఈ పోటీల లక్ష్యం ఏంటంటే..

పురుషుల ఆరోగ్యం, ముఖ్యంగా పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సంస్థ ఈ పోటీలు నిర్వహిస్తోంది. వీర్య కణాల కదలిలకు, సంతాన సాఫల్యతకు మధ్య సంబంధాన్ని హైలైట్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ రేసులో ఇద్దరు వ్యక్తుల నుంచి సేకరించిన రెండు వీర్యకణాలను దించుతారు. అత్యాధునిక ఇమేజింగ్ సాధనాల ద్వారా విజయం దేనిదో తెలుస్తారు. సాధారణంగా పురుషుల వీర్య కణం నిమిషానికి 5 మిల్లీ మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ లెక్కన రేసు పూర్తయ్యేందుకు కొన్ని గంటలు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇవి కూడా చదవండి:

జాబ్‌‌లో మజా లేదని యువతి రాజీనామా.. షాక్‌లో సంస్థ యజమాని

గుండె లోతుల్లోంచి పొంగుకొచ్చిన ఆవేదన.. ఈ రాజీనామా లేఖ చూస్తే..

ట్రెయిన్ టిక్కెట్టు పోగొట్టుకున్న సందర్భాల్లో ఏం చేయాలంటే..

Read Latest and Viral News

Updated Date - Apr 17 , 2025 | 04:17 PM