Live Storm Report: భార్యంటే ఆ మాత్రం భయం ఉండాలి.. లైవ్‌లో ఉన్నా..
ABN, Publish Date - Aug 07 , 2025 | 02:07 PM
Live Storm Report: అతడు తన సొంత టీవీ ఛానల్ కేటీటీసీ న్యూస్‌లో లైవ్ వెదర్ అప్‌డేట్స్ ఇస్తూ ఉన్నాడు. బయట పరిస్థితి బాగోలేదని, జనాలు జాగ్రత్తగా ఉండాలని అన్నాడు.
’ఎంత వారలైనా కాంతాదాసులే‘ అన్నట్లు.. భార్యలంటే భయపడని భర్తలు ఎవరుంటారు చెప్పండి. అడవికి రాజైన సింహం కూడా సివంగి దెబ్బకు భయపడుతుంది. ఇందుకు మనుషులేమీ అతీతం కాదు. అన్ని సార్లు కేవలం భయం మాత్రమే కాకుండా ప్రేమ కూడా మగాళ్లను తగ్గి ఉంచేలా చేస్తుంది. పిచ్చి పిచ్చి పనులు చేసేలా చేస్తుంది. తాజాగా, ఓ మెటీరియాలజిస్ట్ టీవీ లైవ్‌లో చేసిన పని చర్చనీయాంశంగా మారింది. కొంతమంది అతడ్ని తిడుతుంటే.. మరికొంతమంది పొగుడ్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికా, మిన్నిసోటాకు చెందిన నిక్ జన్‌సెన్ మెటీరియాలజిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా, అతడు తన సొంత టీవీ ఛానల్ కేటీటీసీ న్యూస్‌లో లైవ్ వెదర్ అప్‌డేట్స్ ఇస్తూ ఉన్నాడు. బయట పరిస్థితి బాగోలేదని, జనాలు జాగ్రత్తగా ఉండాలని అన్నాడు. ఆ వెంటనే ఫోన్ తీసి తన భార్యకు మెసేజ్ పెట్టాడు. అందరూ క్షేమంగా ఉన్నారా లేదా అని కనుక్కున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..
‘అతడికి చేసే పని మీద భక్తి లేదు. డబ్బుల కోసం చేస్తున్నట్లు ఉంది’.. ‘అతడి ఉద్యోగం అంటే భక్తి లేకపోయినా.. కుటుంబం అంటే ప్రేమ ఉంది. అది చాలు’..‘ఆ ఛానల్ అతడిదే కాబట్టి అంత ధైర్యంగా ఆ పని చేశాడు. లేదంటే మెడపట్టి బయటకు గెంటేసే వారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మోడల్‌కు దారుణమైన అనుభవం.. పట్ట పగలు నడిరోడ్డుపై..
ప్లాస్టిక్ పకోడి.. తిన్నారంటే రోగాలు ఖాయం..
Updated Date - Aug 07 , 2025 | 02:13 PM