Share News

Viral Video: ప్లాస్టిక్ పకోడి.. తిన్నారంటే రోగాలు ఖాయం..

ABN , Publish Date - Aug 07 , 2025 | 01:11 PM

Viral Video: ఓ షాపు వాడు ప్యాకెట్లను ఓపెన్ చేయడానికి ఓ దారుణమైన టెక్నిక్ వాడుతున్నాడు. ఒకే సారి నాలుగు ప్యాకెట్లను వేడి వేడి నూనెలో ముంచుతున్నాడు.

Viral Video: ప్లాస్టిక్ పకోడి.. తిన్నారంటే రోగాలు ఖాయం..
Viral Video

పకోడి అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. చల్లటి సాయంత్రం.. వేడి వేడి పకోడి విత్ టీ భలే కాంబినేషన్ కదూ. చాలా మంది ఇంట్లో చేసుకునే పకోడి కంటే.. బయట రోడ్డు మీద అమ్మే పకోడినే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సాయంత్రం కాగానే రోడ్ సైడ్ షాపుల్లో పకోడి తింటూ ఉంటారు. కేవలం పకోడి అని మాత్రమే కాదు.. బజ్జీలు, పునుగులు, వడలు ఇలా అన్ని రకాల స్నాక్స్ విషయంలో.. అది కూడా రోడ్ సైడ్ షాపుల్లో అమ్మే వాటితో జాగ్రత్తగా ఉండాలి.


వాటిని తయారు చేసే విధానం మంచిది కాకపోతే మన ప్రాణాలు రిస్క్‌లో పడ్డట్టే. 99 శాతం షాపుల వాళ్లు వేయించిన నూనెలోనే మళ్లీ మళ్లీ ఆహార పదార్ధాలను వేయిస్తూ ఉంటారు. అదే డేంజర్ అనుకుంటే.. ఇప్పుడు కొత్త సమస్య వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ప్యాకెట్లలో ఉన్న ఆయిల్‌ను కత్తెరతో కట్ చేసి పెనంలో పోస్తుంటారు. కానీ, పంజాబ్‌, లుథియానాలోని ఓ షాపు వాడు ప్యాకెట్లను ఓపెన్ చేయడానికి ఓ దారుణమైన టెక్నిక్ వాడుతున్నాడు. ఒకే సారి నాలుగు ప్యాకెట్లను వేడి వేడి నూనెలో ముంచుతున్నాడు.


ఆ వేడికి కవర్లు కాలి ఆయిల్ పెనంలో పడుతోంది. అదే నూనెలో పకోడిలు కాల్చి జనాలకు అమ్ముతున్నారు. అయితే, ఈ టెక్నిక్ కారణంగా చాలా దారుణమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. పెనంలో ముంచటం వల్ల ప్లాస్టిక్ పెద్ద మొత్తంలో కరిగి నూనెలో పడిపోతుంది. అలాంటి ఆ నూనెలో ముంచి తీసిన ఏ పదార్థం అయినా విషంతో సమానమే. ఇది డాక్టర్లే స్వయంగా చెబుతున్నారు. ఇక, సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇది మామూలు పకోడి కాదు.. ప్రాణాలు తీసే ప్లాస్టిక్ పకోడి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ప్రియుడితో కలిసి భర్తపై దారుణం.. తల్లి గుట్టు బయటపెట్టిన కూతురు

వెనక్కు తగ్గేదే లే.. ట్రంప్‌కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్..

Updated Date - Aug 07 , 2025 | 01:15 PM