13 Year Old Exposes Mother: ప్రియుడితో కలిసి భర్తపై దారుణం.. తల్లి గుట్టు బయటపెట్టిన కూతురు
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:32 PM
13 Year Old Exposes Mother: రోజురోజుకు తండ్రి పరిస్థితి విషమిస్తుండటంతో పెద్ద కూతురు బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. వారు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భరత్ చనిపోయాడు.
ఈ మధ్య కాలంలో ప్రియుళ్లతో కలిసి భార్యలు భర్తలను చంపుతున్న ఘటనలు బాగా పెరిగిపోయాయి. దేశం ఈ మూలనుంచి ఆ మూల వరకు తరచుగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. యాక్సిడెంట్ అంటూ కట్టు కథలు అల్లబోయింది. కానీ, కన్న కూతురే ఆమెకు ఊహించని షాక్ ఇచ్చింది. తన తండ్రిని తల్లే చంపేసిందని పోలీసులకు చెప్పేసింది. తల్లి, ఆమె ప్రియుడ్ని పోలీసులకు పట్టించింది.
సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన భరత్, రాజశ్రీ భార్యాభర్తలు. వీరికి 13 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. అయితే, రాజశ్రీ గత కొంత కాలంనుంచి చంద్రశేఖర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భరత్‌కు తెలిసింది. దీంతో భార్యను నిలదీశాడు. అయితే, ఇక్కడే ఓ ట్విస్ట్ ఎదురైంది. చంద్రశేఖర్ తనను వేధిస్తున్నాడని రాజశ్రీ తన భర్తకు చెప్పింది. అతడు చంద్రశేఖర్‌కు ఫోన్ చేశాడు. భార్యను వేధిస్తున్న సంగతి అడిగాడు.
‘ఏక్తానగర్, ఆరే కాలనీ, పబ్లిక్ టాయిలెట్ దగ్గర కలుద్దాం, మాట్లాడదాం రా’ అని చంద్రశేఖర్ .. భరత్‌కు చెప్పాడు. జులై 15వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో చంద్రశేఖర్ చెప్పిన చోటుకు భరత్ వెళ్లాడు. చంద్రశేఖర్ తన అనుచరుడు రంగాతో అక్కడి వచ్చాడు. అక్కడ చంద్రశేఖర్, రంగాలు కలిసి భరత్‌పై దాడి చేశారు. జనం రావటంతో అక్కడినుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ భర్తను రాజశ్రీ ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. ఇంటికి తీసుకెళ్లింది. మూడు రోజులు చికిత్స చేయించకుండా అలానే ఇంట్లో పెట్టింది.
రోజురోజుకు తండ్రి పరిస్థితి విషమిస్తుండటంతో పెద్ద కూతురు బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. వారు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భరత్ చనిపోయాడు. అయితే, తన భర్త యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డాడని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని రాజశ్రీ పోలీసులకు చెప్పింది. కానీ, పెద్ద కూతురు మాత్రం తల్లికి ఊహించని షాక్ ఇచ్చింది. జరిగిందంతా వారికి చెప్పింది. ‘మా నాన్నపై దాడి జరుగుతున్నపుడు నేను అక్కడే ఉన్నాను. నేను, మా అమ్మ 30 మీటర్ల దూరంలో ఉన్నాము. మా నాన్నను కొడుతుంటే అమ్మ అక్కడికి వెళ్లలేదు. చూస్తూ ఉంది. ఆస్పత్రికి కాకుండా ఇంటికి తీసుకెళ్లింది’ అని అంది. బాలిక స్టేట్‌మెంట్ ఇవ్వటంతో.. పోలీసులు రాజశ్రీ, చంద్రశేఖర్, రంగాలను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
వెనక్కు తగ్గేదే లే.. ట్రంప్‌కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్..
భయపెడుతున్న బాబా వాంగ జ్యోష్యం.. ఆగస్టులో ఏం జరగబోతోంది?..