Baba Vanga Prediction: భయపెడుతున్న బాబా వంగా జ్యోష్యం.. ఆగస్టులో ఏం జరగబోతోంది?..
ABN , Publish Date - Aug 07 , 2025 | 10:56 AM
Baba Vangas Prediction: బాబా వంగా ఓ విచిత్రమైన జ్యోష్యం చెప్పింది. ‘ 2025లో ఓ చెయ్యి రెండుగా విడిపోతుంది. రెండు చేతులు చెరో దారిన వెళ్లిపోతాయి’ అని అంది. ఆమె అన్నదానికి అర్థం ఏంటో ఇప్పటికీ ఎవ్వరికీ క్లారిటీ లేదు.
బాబా వంగా పేరు వినపడగానే ప్రపంచ జనాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆమె చెప్పిన జ్యోష్యాలు తలుచుకుని వెన్నులో వణకు పుడుతోంది. ఎప్పుడో 1996లో బాబా వాంగ చనిపోయింది. ఆమె బతికున్నపుడు చెప్పినవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజం అవుతున్నాయి. జనాల్ని కలవర పెడుతున్న విషయం ఏంటంటే.. 2025 ఆగస్టులో ‘డబుల్ ఫైర్’ జరుగుతుందని ఆమె చెప్పింది. లుథియానియన్ న్యూస్ పేపర్ కథనం ప్రకారం.. ఆమె చెప్పిన ‘డబుల్ ఫైర్’ వెనుక అంతరార్థం ఏంటో ఎవ్వరికీ తెలీదు.
కానీ, డబుల్ ఫైర్ అంటే.. రెండు విధాలుగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటాయని ప్రజలు భావిస్తున్నారు. ఒకటి భూమ్మీద నుంచి, రెండోది ఆకాశంలోంచి. భూమ్మీద అంటే.. అడవులు తగలబడతాయి. ఆకాశంలో అంటే అగ్ని పర్వతం బద్ధలు అవుతుంది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే.. ఆకాశంలోంచి ఓ ఉల్క భూమిపై పడుతుందట. ఎవ్వరికీ బాబా వంగ జ్యోష్యంపై క్లారిటీ లేదు. ప్రపంచ దేశాల ప్రజలు ఆమె ఏం చెప్పిందో అర్థంకాక, ఎవరికి వారు ఊహాగానాలు చేసుకుంటున్నారు. భయపడుతున్నారు.
వింత జ్యోష్యం.. భూమ్మీదకు ఎలియన్స్..
బాబా వాంగ ఓ విచిత్రమైన జ్యోష్యం చెప్పింది. ‘ 2025లో ఓ చెయ్యి రెండుగా విడిపోతుంది. రెండు చేతులు చెరో దారిన వెళ్లిపోతాయి’ అని అంది. ఆమె అన్నదానికి అర్థం ఏంటో ఇప్పటికీ ఎవ్వరికీ క్లారిటీ లేదు. నాటో లేదా యురోపియన్ యూనియన్ గ్రూపులు రెండుగా విడిపోయే అవకాశం ఉందని కొందరు అనుకుంటున్నారు. ఇక, ఇదే 2025లో బాబా వాంగ ఈ భూమ్మీదకు ఎలియన్స్ వస్తాయని కూడా చెప్పింది. ఆమె చెప్పినవన్నీ జరుగుతాయో లేదో వేచి చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
స్పీకర్ సంచలన కామెంట్స్.. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న కేంద్రం
రక్షా బంధన్ చరిత్ర మీకు తెలుసా? ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!