Share News

Assembly Speaker: స్పీకర్ సంచలన కామెంట్స్.. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న కేంద్రం

ABN , Publish Date - Aug 07 , 2025 | 10:37 AM

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుకుని, లేనిపోని ఆటంకాలు సృష్టిస్తోందని శాసనసభ స్పీకర్‌ అప్పావు ఆరోపించారు. తిరునల్వేలిలో గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.

Assembly Speaker: స్పీకర్ సంచలన కామెంట్స్.. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న కేంద్రం

చెన్నై: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుకుని, లేనిపోని ఆటంకాలు సృష్టిస్తోందని శాసనసభ స్పీకర్‌ అప్పావు(Assembly Speaker Appavu) ఆరోపించారు. తిరునల్వేలిలో గురువారం ఉదయం ఆయ న మీడియాతో మాట్లాడుతూ.. దేశ విదేశీ వ్యవహారాల విధానం బలహీనమై పోయిందని, పహల్గామ్‌ దాడులకు సంబంధించి పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాలేవీ ఖండించలేదని గుర్తు చేశారు.


రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినట్లు అన్నాడీఎంకే నేతలు ఆరోపిస్తున్నారని, తిరుప్పూరు వద్ద అన్నాడీఎంకే ఎమ్మెల్యేకి చెందిన తోటలో ఎస్సై దారుణహత్యకు గురయ్యారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నదెవరో ఈ సంఘటన రుజువు చేస్తుందన్నారు. కలైంజర్‌ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును గవర్నర్‌ అంగీకరించకపోవడం విచారకరమని, కొత్త విశ్వవిద్యాలయాలను ప్రారంభించే హక్కు రాష్ట్రానికి ఉందని, ఈ విషయం తెలిసినా గవర్నర్‌ ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపడం గర్హనీయమన్నారు.


డీఎంకే ప్రభుత్వం దక్షిణాది జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని ఆరోపించిన వారంతా విన్‌పా్‌స్ట కార్ల కర్మాగారం ప్రారంభం, పెట్టుబడిదారుల సదస్సులో పలు కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం చూసి విస్తుపోతున్నారన్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రం 11.19 శాతం ఆర్థికాభివృద్ధి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని,


nani2.2.jpg

ఈ విషయం కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌కు తెలియకపోవడం వింతగా ఉందన్నారు. విదేశీ పెట్టుబడుల సమీకరణ ద్వారా రాష్ట్రానికి అందిన నిధులను వివరాలను చెప్పాలని మురుగన్‌ డిమాండ్‌ చేయడం కూడా విడ్డూరంగా ఉందని, విదేశాల నుండి వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వ పరిశీలించిన మీదటే రాష్ట్రానికి అందుతాయన్న విషయం కూడా ఆయనకు తెలియదా అని స్పీకర్‌ అప్పావు ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దొంగ డెత్‌ సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 10:37 AM