Share News

Modi Tariffs Response: వెనక్కు తగ్గేదే లే.. ట్రంప్‌కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్..

ABN , Publish Date - Aug 07 , 2025 | 11:32 AM

Modi Tariffs Response: రష్యాతో చమురు ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అయితే, భారత్ మాత్రం ట్రంప్ చర్యల్ని లెక్క చేయటం లేదు. 50 శాతం టారిఫ్‌లు వేసినా వెనక్కు తగ్గటం లేదు.

Modi Tariffs Response: వెనక్కు తగ్గేదే లే.. ట్రంప్‌కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్..
Modi Tariffs Response

న్యూఢిల్లీ, ఆగస్టు 07: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల పేరుతో ప్రపంచ దేశాలను భయపెడుతున్న సంగతి తెలిసిందే. తన మాట వినటం లేదన్న కోపంతో ఇండియాపై ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించారు. రష్యాతో చమురు ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ భారత్ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ టారిఫ్‌ల విషయంలో ఓ క్లారిటీ ఇచ్చారు. ట్రంప్ మతిపోయేలా సమాధానం ఇచ్చారు.


గురువారం ఎమ్ఎస్ స్వామినాథన్ సెంటెనరీ ఇంటర్‌నేషనల్ కాన్ఫిరెన్స్‌లో మోదీ మాట్లాడుతూ.. ‘మేము వెనక్కు తగ్గే అవకాశమే లేదు. మాకు రైతుల సంక్షేమమే ముఖ్యం. అదే మా ప్రధాన లక్ష్యం. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల విషయంలో భారత్ ఎప్పుడూ వెనక్కు తగ్గదు. మాకు తెలుసు. దీని కారణంగా చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని. దానికి కూడా మేము సిద్దమే. భారత్ కూడా సిద్దమే’అని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

భయపెడుతున్న బాబా వాంగ జ్యోష్యం.. ఆగస్టులో ఏం జరగబోతోంది?..

రక్షా బంధన్ చరిత్ర మీకు తెలుసా? ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Updated Date - Aug 07 , 2025 | 12:26 PM