Model Alleges Harassment: మోడల్‌కు దారుణమైన అనుభవం.. పట్ట పగలు నడిరోడ్డుపై..
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:50 PM
Model Alleges Harassment: ఆమెకు కొంత దూరంలో ఓ వ్యక్తి నిల్చుని ఉన్నాడు. ఏం పోయే కాలమో ఏమో తెలీదు కానీ, ఆ వ్యక్తి మోడల్ ముందు అసభ్యంగా ప్రవర్తించటం మొదలెట్టాడు. ప్యాంట్స్ జిప్ ఓపెన్ చేశాడు.
ఈ మధ్య కాలంలో ఆడవాళ్ల పట్ల అనుచిత, అసభ్య ప్రవర్తనలు ఎక్కువై పోయాయి. కేవలం రాత్రిళ్లు మాత్రమే కాదు.. పగలు కూడా స్త్రీలకు భద్రత లేకుండా పోయింది. తాజాగా, ఓవ్యక్తి పట్ట పగలు, నడిరోడ్డులో మోడల్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. చుట్టూ జనం తిరుగుతూ ఉన్నారన్న ఇంగితం లేకుండా నీఛంగా నడుచుకున్నాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గురుగావ్‌కు చెందిన ఓ మోడల్ క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ కోసం రాజీవ్ చౌక్‌లో ఎదురు చూస్తూ ఉంది.
ఆమెకు కొంత దూరంలో ఓ వ్యక్తి నిల్చుని ఉన్నాడు. ఏం పోయే కాలమో ఏమో తెలీదు కానీ, ఆ వ్యక్తి మోడల్ ముందు అసభ్యంగా ప్రవర్తించటం మొదలెట్టాడు. ప్యాంట్స్ జిప్ ఓపెన్ చేశాడు. ఆమె వైపు చూస్తూ అటు, ఇటు తిరగసాగాడు. దీన్నంతా ఆ మోడల్ వీడియో తీసింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ‘ఈ రోజు రాజీవ్ చౌక్ దగ్గర ఓ వ్యక్తి నన్ను ఫాలో అయ్యాడు. పబ్లిక్‌లో తన ప్యాంట్ విప్పి అసభ్యంగా ప్రవర్తించాడు. నేను ఒంటరిగా నిల్చుని ఉన్నా.
భయం వేసింది. కానీ, ధైర్యంగా నిలబడ్డా. ప్రతీ రోజూ ఆడవాళ్లకు ఎదురవుతున్న దారుణాలు ఇవే. ఇలాంటివి ఆగాల్సిన అవసరం చాలా ఉంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మీరు ధైర్యంగా ఉండండి’..‘అతడి మీద పోలీసులకు కంప్లైంట్ చేయ్’..‘అలాంటి వాళ్లను ఊరికే వదిలి పెట్టకూడదు. పోలీసులకు పట్టించాలి’ అని కొంతమంది పాజిటివ్‌గా స్పందిస్తుంటే.. కొంతమంది మాత్రం ఆమెను తిడుతూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్లాస్టిక్ పకోడి.. తిన్నారంటే రోగాలు ఖాయం..
ప్రియుడితో కలిసి భర్తపై దారుణం.. తల్లి గుట్టు బయటపెట్టిన కూతురు