Pesticide: భార్య చెప్పినా వినక.. చేతులు కడుక్కోకుండా భోజనం చేసి యువకుడి దుర్మణం!
ABN, Publish Date - Jan 26 , 2025 | 10:53 PM
పొలంలో పురుగుల మందు జల్లి ఇంటికొచ్చాడు. చేతుల కడుక్కోకుండానే భోజనానికి సిద్ధమయ్యాడు. భార్య వారించినా వినలేదు. చివరకు అతడి మెండితనమే అతడి పాలి మృత్యువుగా మారింది. యూపీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: పొలంలో పురుగుల మందు జల్లి వచ్చిన ఓ వ్యక్తి చేయి కడుక్కోకుండానే భోజనం చేసి మృత్యువాత పడ్డాడు. యూపీలో ఆదివారం ఈ సంచలన ఘటన వెలుగు చూసింది. మృతుడిని మథురకు చెందిన కన్హయ్య కుమార్‌గా గుర్తించారు (Viral).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కన్హయ్య అనే వ్యక్తి శనివారం పొలంలో పురుగుల మందు జల్లాడు. ఇంటికి తిరిగొచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోకుండానే భోజనానికి కూర్చొన్నాడు. కానీ భార్య మాత్రం రాబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించింది. చేతులకు అంటిన పురుగుల మందు పోయేలా శుభ్రంగా కడుక్కుని రమ్మని పదే పదే చెప్పింది. కానీ కన్హయ్య మాత్రం ఆమె సూచనను పెడ చెవిన పెట్టాడు. ఆమె భయాలను కొట్టిపారేశాడు. చివరకు అదే చేయితో భోజనం చేసి పడుకున్నాడు.
China Corgi Police Dog: పోలీసు జాగిలానికి బోనస్ కట్! ఎందుకింత కఠిన శిక్ష అంటే..
ఆ తరువాత కొద్ది సేపటికే అతడి పరిస్థితి వికటించింది. ఏదో మత్తులో కూరుకుపోతున్నట్టు అయిపోయాడు. నిమిషాల వ్యవధిలోనే పరిస్థితి చేయి దాటింది. కుటుంబసభ్యులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు.
Kumbhmela Monalisa: కుంభమేళా మోనాలిసాను వదలని ఇబ్బందులు.. సోషల్ మీడియాతో డబ్బు ఆర్జిద్దామనుకుంటే..
క్రిమిసంహారకాలు కీటకాలకే కాకుండా మనుషులకు కూడా హాని తలపెట్టగలవని నిపుణులు చెబుతున్నారు. వీటితో శరీరంలోని వివిధ అవయవాలపై ప్రతిప్రభావం పడి చివరకు మరణం సంభవిస్తుంది. వైద్యులు చెప్పే దాని ప్రకారం, ఆర్గానోఫాస్ఫరస్, కార్బామేట్స్ క్రిమిసంహారకాలు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. ఒక్కోసారి బాధితులు కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. మరికొన్ని క్రిమి సంహారకాలు శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది మొదలై చివరకు రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌కు కారణమవుతుంది. కొన్ని గుండెమీద, మరికొన్ని జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. పేగుల్లో అంతర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇక గర్భస్త శిశువులోకి క్రిమిసంహారకాలు చేరితే పిండం ఎదుగుదలకు అవరోధం ఏర్పడుతుంది. కాబట్టి, వీటి విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
108 year old street vendor: వావ్.. ఈ పెద్దాయన నిజంగా గ్రేట్.. 108 ఏళ్ల వయసులో కూడా..
Carbonated Water: సోడాతో ఇలాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయా? ఆసక్తి రేపుతున్న అధ్యయనం!
Updated Date - Jan 26 , 2025 | 10:53 PM