Share News

Kumbhmela Monalisa: కుంభమేళా మోనాలిసాను వదలని ఇబ్బందులు.. సోషల్ మీడియాతో డబ్బు ఆర్జిద్దామనుకుంటే..

ABN , Publish Date - Jan 26 , 2025 | 08:09 PM

కుంభమేళా మోనాలిసాగా ఇటీవల పాప్యులర్ అయిన మోనీ భోస్లే ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాకింగ్‌కు గురైంది. సోషల్ మీడియాలో తన పాప్యులారిటీతో సొమ్ము చేసుకుందామనుకుంటే ఇలా జరిగిందని ఆమె వాపోయింది.

Kumbhmela Monalisa: కుంభమేళా మోనాలిసాను వదలని ఇబ్బందులు.. సోషల్ మీడియాతో డబ్బు ఆర్జిద్దామనుకుంటే..

ఇంటర్నెట్ డెస్క్: అకస్మాత్తుగా వచ్చిన సోషల్ మీడియా పాప్యులారిటీతో ఇక్కట్ల పాలైన కుంభమేళా మోనాలిసా ప్రయాగ్‌రాజ్‌ను వీడినా ఆమెకు మనశ్శాంతి మాత్రం కరువైంది. తాజాగా ఆమె తన ఇన్‌‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారంటూ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం తనకు ఏం చేయాలో పాలుపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది (Kumbhmela Monalisa).

కుంభమేళా మోనాలిసాగా పాప్యులర్ కావడంతో మోనీ భోస్లేకు పోకిరీల బెడద పెరిగింది. ప్రయాగ్‌రాజ్‌లో పూల దండలు విక్రయించి పొట్టపోసుకుందామని వచ్చిన ఆమెను పోకిరీలు సెల్ఫీలు కావాలంటూ వేధించడం ప్రారంభించారు. చివరకు ఆమె టెంట్‌లోకి వచ్చి ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో మోనీ తండ్రి ఆమెను తమ స్వస్థలమైన ఇండోర్‌కు పంపించారు. అప్పట్లో మోనీ స్వయంగా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది. మరో కుంభ మేళాలో కలుసుకుందామంటూ ధన్యవాదాలు తెలిపింది (Viral).


108 year old street vendor: వావ్.. ఈ పెద్దాయన నిజంగా గ్రేట్.. 108 ఏళ్ల వయసులో కూడా..

ప్రయాగ్‌రాజ్‌లో ఎలాగూ అనుకున్న మేర ఆదారం లేక ఇబ్బంది పడ్డ మోనాలిసా చివరకు సోషల్ మీడియా పాప్యులారిటీతో ఆర్థికంగా నిలదొక్కుకుందామని భావించింది. తన ఇన్‌ష్టా అకౌంట్‌లో ఏవో వీడియోలు పోస్టు చేసింది. కానీ ఆమె కోరినది జరిగేలోపే ఇన్‌స్టా అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది.


Viral: నిర్మానుష్యంగా మారిన ఇళ్లతో వ్యాపారం.. ఏకంగా రూ.7 కోట్ల ఆదాయం!

ఈ విషయాలన్నీ మోనీ ఎక్స్ వేదికగా పంచుకుంది. తాను ఉండే ఇంటిని కూడా చూపించింది. తానుంటున్న గ్రామంలో సుమారు 100 మంది వరకూ ఉంటారని కూడా చెప్పుకొచచింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా డబ్బు సంపాదిద్దామనుకుంటే ఇలా జరిగిపోయిందని విచారం వ్యక్తం చేసింది. ఇప్పుడేం చేయాలో పాలుపోవట్లేదని పేర్కొంది. ఇక ఈ విషయం పోలీసులకు చేరిందీ లేనిదీ కూడా ఇంకా తెలియరాలేదు. అయితే, సమస్యకు పరిష్కారం కోసం తనకు చేతనైనది చేస్తానని మోనీ చెప్పుకొచ్చింది. తనకు సోషల్ మీడియాలో ఇంత గుర్తింపునకు కారణమైన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. దీంతో, ఈ మోనాలిసా పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అనేక మంది ఆమె పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. నిరుపేదను ఇంతలా ఇక్కట్లా పాలు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

Carbonated Water: సోడాతో ఇలాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయా? ఆసక్తి రేపుతున్న అధ్యయనం!

Read Latest and Viral News

Updated Date - Jan 26 , 2025 | 08:59 PM