108 year old street vendor: వావ్.. ఈ పెద్దాయన నిజంగా గ్రేట్.. 108 ఏళ్ల వయసులో కూడా..
ABN , Publish Date - Jan 26 , 2025 | 05:54 PM
108 ఏళ్ల వయసులో కూడా బండిపై కూరగాయలు విక్రయిస్తున్న ఓ పెద్దాయన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పంజాబ్‌కు చెందిన ఈ వ్యక్తిపై ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: నేటి తరంలోని అనేక మందిలో 40 ఏళ్ల కూడా రాకముందే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. కాలు కదిపినా కూడా ఆయాస పడిపోయే వారు కనిపిస్తున్నారు. కానీ 108 ఏళ్ల వయసులో కూడా ఓ పెద్దాయన కుర్రాడిలో తన జీవితాన్ని హుషారుగా గడిపేస్తున్నారు. తన కాళ్లపై తాను నిలబడుతూ చేతనైన మేర సంపాదించుకుంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో, ఈ పెద్దాయన ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది. జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది (108 year old street vendor).
Viral: నిర్మానుష్యంగా మారిన ఇళ్లతో వ్యాపారం.. ఏకంగా రూ.7 కోట్ల ఆదాయం!
పూర్తి వివరాల్లోకి వెళితే.. మణి అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ పెద్దాయన వీడియోను నెట్టింట పంచుకున్నారు. పంజాబ్‌లకు తనకు ఆయన తారసపడ్డట్టు చెప్పుకొచ్చారు. ‘‘ఈ రోజు నేనో గొప్ప వ్యక్తిని కలిశా. ఆయన వయసు ఏకంగా 108 ఏళ్లు. ఇంత పెద్ద వయసులో కూడా ఆయన వీధిలో కూరగాయల బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఆయనకున్న కష్టించే తత్వం, దేన్నైనా తట్టుకుని నిలబడ గలిగే తెగువా నాలో స్ఫూర్తి నింపింది’’ అని వ్యాఖ్యానించారు.
Carbonated Water: సోడాతో ఇలాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయా? ఆసక్తి రేపుతున్న అధ్యయనం!
మణి షేర్ చేసిన వీడియోలోని పెద్దాయన అంత పెద్ద వయసులోనూ చాలా హుషారుగా కనిపించారు. సరదాగా మాట్లాడుతూ చలాకీగా తన పని తాను చేసుకుపోయారు. ఈలోపు పెద్దాయన గురించి తెలిసిన వారు ఆశ్చర్యపోతూ ఆయన చుట్టూ చేరడం కూడా వీడియోలో చూడొచ్చు.
ఇక సోషల్ మీడియా యూజర్లు పెద్దాయనపై లెక్కలేనన్ని ప్రశంసలు కురిపించారు. ఈయన ఎప్పటికీ ఇలా చలాకీగా ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఉత్సాహం నేటి యువతరంలో కూడా కనిపించదని కొందరు అభిప్రాయపడ్డారు. యువత ఈయనను చూసి నేర్చుకోవాలసింది ఎంతో ఉందని అన్నారు. వార్ధక్యంతో వచ్చే అనారోగ్యాలను పక్కన పెట్టి ముందడుగు వేసే ఈ పెద్దాయనకు మించిన సూపర్ హీరో లేరని కూడా కొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో ఉంది.
బ్రెజిల్‌కు చెందిన జవావ్ మరిన్హో నెటో ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత పెద్ద వయస్కుడిగా ఉన్నారు. ఆయన వయసు 112 సంవత్సరాలు. 1912, అక్టోబర్ 5న జన్మించారు. ఆయన వయసును కుటుంబసభ్యులు, బంధువుల ద్వారా రూఢీ అయ్యింది.