Viral: నిర్మానుష్యంగా మారిన ఇళ్లతో వ్యాపారం.. ఏకంగా రూ.7 కోట్ల ఆదాయం!
ABN , Publish Date - Jan 25 , 2025 | 08:14 PM
జనాలు ఎవరూ ఉండటానికి ఇష్టపడని ఇళ్లను సొంతం చేసుకుని, వాటిని ఆపై అద్దెకు ఇచ్చి కోట్లకు పడగలెత్తాడో రియల్ ఎస్టేట్ ఏజెంట్. అతడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: బిజినెస్ బ్రెయిన్ ఉన్న వాళ్లు తమ జీవితాన్ని తామే నిర్దేశించుకోగలుగుతారు. అవకాశాల్ని అందిపుచ్చుకుని సకల సంపదలు పొందుతారు. సరిగ్గా ఇలాంటి మైండ్‌సెట్ ఉన్న ఓ జపాన్ యువకుడు కోట్లు కొల్లగొడుతున్నాడు. వ్యాపారదక్షణ అంటే ఏంటో కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాడు (Viral).
ఒసాకాకు చెందిన 38 ఏళ్ల హయాటో కవమురాకు రియల్ ఎస్టేట్ రంగంలో గొప్ప అనుభవం ఉంది. ఈ అనుభవానికి తోడు వినూత్న ఆలోచనతో ముందడుగు వేస్తున్న అతడు జనాలు ఎవరూ ఉండని ఇళ్లను అద్దెకు ఇచ్చి ఏటా రూ.7 కోట్లు అద్దెల రూపంలో దండుకుంటున్నాడు. అతడికి చిన్న తనం నుంచే రియల్ ఎస్టేట్ రంగంపై ఆసక్తి. దీంతో, ఖాళీ దొరికినప్పుడల్లా అతడు రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకునే వాడు. గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఖాళీ భవంతులను చూసొస్తుండేవాడు.
Carbonated Water: సోడాతో ఇలాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయా? ఆసక్తి రేపుతున్న అధ్యయనం!
ఈ అనురక్తితో రియల్ రంగంలోకి దిగిన అతడికి మొదట్లోనే వాస్తవం బోధపడింది. ఓ కన్సల్టింగ్ సంస్థలో పని చేస్తుండగా తన బాస్‌కు ఎలాంటి అవమానం జరిగిందీ ప్రత్యక్షంగా చూసి షాకైపోయాడు. ప్రైవేటు రంగంలో టాలెంట్ కంటే బాస్‌కు నచ్చితేనే కెరీర్‌లో ముందుకు వెళతామని భావించాడు. కాబట్టి, సొంత కాళ్లపై నిలబడటమే మేలని నిర్ణయించుకున్నాడు.
‘‘ప్రతిభ ఉన్నంత మాత్రాన ప్రమోషన్లు రావని నాకు అప్పుడు అర్థమైంది. నీ పై అధికారికి నీవు నచ్చితేనే డబ్బు వస్తుందని తేలింది. దీంతో, సొంత కాళ్లపై నిలబడాలనుకున్నా. నెల జీతం మీద ఆధారపడే బతుకు వద్దని డిసైడయ్యా’’ అని అతడు చెప్పుకొచ్చాడు
Man leaks Cholesterol: బాబోయ్ ఇదేం వింత వ్యాధి! వ్యక్తి చేతుల్లోంచి లీకైపోతున్న కొలెస్టెరాల్
ఈ క్రమంలోనే అతడి దృష్టి జనాలు వదిలిపెట్టి వెళ్లిపోయిన ఇళ్లపై పడింది. ఎవరూ కలలో కూడా ఊహించని వ్యాపారావకాశం ఆ పాడుబడ్డ ఇళ్లల్లో కనిపించింది. తొలుత వాటిని అతడు చేజిక్కించుకుని ఆపై రెంటుకు ఇచ్చేవాడు. ఓ నాలుగైదేళ్లు ఇలా అద్దెల రూపంలో ఆదయం పొందాక వాటిని అమ్మేసేవాడు. ఇలా పాత ఇళ్లతో వింత వ్యాపారం చేస్తూ అతడు చూస్తుండగానే కోటీశ్వరుడైపోయాడు. ఏటా రూ.7 కోట్ల అద్దెలు తీసుకునే వ్యక్తిగా నిలిచాడు.