China Corgi Police Dog: పోలీసు జాగిలానికి బోనస్ కట్! ఎందుకింత కఠిన శిక్ష అంటే..
ABN , Publish Date - Jan 26 , 2025 | 09:15 PM
చైనాలోని వేఫాంగ్ పోలీసు శాఖకు చెందిన ఓ కుక్క విధుల్లో ఉండగా నిద్రించడంతో పైఅధికారులు దానికి ఇచ్చే బోనస్‌లో కోత పెట్టారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మనిషి పట్ల విశ్వాసపాత్రంగా ఉండే ఒకే ఒక జంతువు కుక్క. ఒంటరితనాన్ని దూరం చేసే మిత్రుడిగా, వైకల్యం ఉన్న వారికి సహాయకారిగా, పోలీసులకు నమ్మిన బంటుగా జాగిలాలు ఎంతో నమ్మకంగా ఉంటాయి. శునకాలకు ఎంత శిక్షణ ఇచ్చినా కూడా అది ఒక జంతువు. పొరపాట్లు చేస్తూనే ఉంటాయి. అయితే. చైనాలో పోలీసు శాఖ మాత్రం ఓ జాగిలానికి ఇచ్చే బోనస్‌లో కోత పెట్టింది. ఈ ఉదంతం నెట్టింట కూడా తెగ వైరల్ అవుతోంది (Viral).
కుంభమేళా మోనాలిసాను వదలని ఇబ్బందులు.. సోషల్ మీడియాతో డబ్బు ఆర్జిద్దామనుకుంటే..
పూర్తి వివరాల్లోకి వెళితే, చైనాలో కోర్గీ జాతికి చెందిన ఫుజాయ్ అనే కుక్క పోలీసు శాఖలో పోలీసు కుక్కగా ఉద్యోగం దొరికింది. పోలీసు దళంలో చేరిన తొలి కోర్గీ జాతి కుక్కగా అది గుర్తింపు పొందింది. 2023లో జన్మించిన ఈ జాగిలానికి శిక్షణ ఇచ్చి పోలీసు విభాగంలో పెట్టుకున్నారు (China Corgi Police Dog). ముఖ్యంగా పేలుడు పదార్థాలను గుర్తించి అప్రమత్తం చేయడం దీని పని. పొట్టి కాళ్లతో పొడుగు దేశంతో ఉండే ఈ కుక్క చూస్తుండగానే చైనాలో బాగా పాప్యులర్ అయిపోయింది. వీఫాంగ్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో తరచూ దీని ఫొటోలు నెట్టింట షేర్ చేస్తుండేది. దీని అకౌంట్‌ను సుమారు 3.84 లక్షల మంది ఫాలో అవుతుంటారు.
108 year old street vendor: వావ్.. ఈ పెద్దాయన నిజంగా గ్రేట్.. 108 ఏళ్ల వయసులో కూడా..
రెండు నెలల వయసులో ఉండగానే దాని టాలెంట్ గుర్తించిన ఓ వ్యక్తి ఫుజాయ్‌ను పోలీసులకు ఇచ్చారు. ఇక ఫుజాయ్ పోలీసులు అప్పగించిన బాధ్యతలు అనేకం విజయవంతంగా నిర్వహించింది. పై అధికారుల మెప్పు కూడా పొందింది. కానీ విధుల్లో అలసటో మరో కారమో తెలీదు కానీ అద సడెన్‌గా ఈ పని చేయడంతో పోలీసులు క్రమశిక్షణ చర్యలకు దిగారట. అయితే, ఫుజాయ్ అభిమానులు విచారం వ్యక్తం చేయడంతో ఏడాది చివర్లో కుక్కకు బోలెడన్ని బహుమతులు ఇచ్చారట.
అక్కడ వరకూ బాగానే ఉన్నా ఆ తరువాత పరిస్థితి అనూహ్య మలుపు తిరిగింది. ఓ రోజు ఫుజాయ్ విధుల్లో ఉండగానే చిన్న కునుకు తీసింది. మరో సందర్భంలో తను తినాల్సిన ఫుడ్ బౌల్‌లోనే మూత్ర విసర్జన చేసింది. ఈ పనులు అధికారులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. చివరకు దానికి ఏటా చెల్లించే బోనస్‌లో కోత పెట్టారు. ఈ వార్త జనాలకు తెలిసి ఆశ్చర్యపోతున్నారు. దీంతో, ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.