Crocodile VS Lions: మూడు సింహాల మధ్యలో మొసలి.. చంపాలని చూడగా చివరకు షాకింగ్ ట్విస్ట్..
ABN, Publish Date - Aug 12 , 2025 | 06:06 PM
నీటి ఒడ్డుకు వచ్చిన పెద్ద మొసలి వేట కోసం ఎదురు చూస్తుంటుంది. అదే సమయంలో సింహాలు కూడా వేట కోసం అటుగా వచ్చాయి. మొసలిని చూడగానే ముందుగా వాటిలో ఓ సింహం.. పరుగు పరుగున దాని వద్దకు వెళ్లింది.
అడవికి రాజైన సింహం ఎంత శక్తివంతమైన జంతువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే నీళ్లలో మొసలిని మించిన జీవి మరోటి లేదనడంలో కూడా అతిశయోక్తిలేదు. మరి ఈ రెండూ ఎదురుపడితే ఎలా ఉంటుందంటే.. సమాధానం చెప్పలేని పరిస్థితి. కొన్నిసార్లు మొసలిది పైచేయి అయితే.. మరికొన్నిసార్లు సింహాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటాయి. మొసలి, సింహాల యుద్ధానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒక్క మొసలిని మూడు సింహాలు చుట్టుముట్టాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నీటి ఒడ్డుకు వచ్చిన పెద్ద మొసలి వేట కోసం ఎదురు చూస్తుంటుంది. అదే సమయంలో సింహాలు కూడా వేట కోసం అటుగా వచ్చాయి. మొసలిని చూడగానే ముందుగా వాటిలో ఓ సింహం.. పరుగు పరుగున దాని వద్దకు వెళ్లింది. పంజా విసిరి దాడి చేయాలని చూసింది.
అయితే సింహం దాడితో అలెర్ట్ అయిన మొసలి.. తిరిగి దానిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో సింహం భయపడిపోయి దూరంగా జరుగుతుంది. అయితే ఇంతలో అక్కడే ఉన్న మరో రెండు సింహాలు.. మొసలిపై (Lions Tried to Attack Crocodile) దాడి చేసేందుకు వచ్చాయి. మూడు సింహాలు కలిసి మొసలిని చుట్టుముడతాయి. అన్నీ కలిసి మొసలిని తికమకపెడుతూ పంజాతో కొట్టడానికి ప్రయత్నిస్తాయి. అయితే మొసలి ఏమాత్రం వెనక్కు తగ్గకుండా వాటిపై దూకుతూ ఎదురుగా దాడి చేస్తుంది.
మొసలి రియాక్షన్‌తో మూడు సింహాలు కూడా దానిపై దాడి చేసుందుకు జంకుతుంటాయి. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మొసలి బలం మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘సింహాలకు చుక్కలు చూపించిన మొసలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 55 వేలకు పైగా లైక్‌లు, 2.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..
ప్రియురాలి అత్యుత్సాహం.. రెండో అంతస్తులో పరుగెత్తుకుంటూ రావడంతో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Aug 12 , 2025 | 06:14 PM