సంఘటితం.. ఈ సాహసం...
ABN, Publish Date - May 25 , 2025 | 09:12 AM
మనదగ్గర మానవ పిరమిడ్‌లా మారి ఉట్టిని కొట్టే తరహాలో అన్నమాట. ఇక్కడ ఉట్టికి బదులు టోపీ ఉంటుంది. ఈ టోపీని ‘డిక్సీ కప్’గా పిలుస్తారు. ఈ కప్‌ను చేజిక్కించుకున్న వ్యక్తి రాబోయే ఏడాది క్లాస్ లీడర్ అవుతాడు.
‘అమెరికా నావెల్ అకాడమీ’లో మిడ్‌షిప్‌మెన్ కోర్సులో ఫ్రెషర్లకు (ఇక్కడ ఫ్లీబ్స్‌గా పిలుస్తారు) ఏటా విచిత్రమైన పరీక్ష నిర్వహిస్తారు. మేరీల్యాండ్‌లోని ఆనాపొలిస్‌లో ఉన్న నేవీ అకాడమీలో 21 అడుగుల గ్రానైట్ స్మారక స్థూపం ఉంది. దీనినే ‘కెప్టెన్ హెర్న్‌డన్ స్థూపం’ అంటారు. మొదటి ఏడాది విద్యార్థులు, విద్యార్థినులు అందరూ కలసి పిరమిడ్ ఆకారంలో అంచెలంచెలుగా పాకుతూ స్థూపం పైన ఉన్న టోపీని అందుకోవాలి. మనదగ్గర మానవ పిరమిడ్‌లా మారి ఉట్టిని కొట్టే తరహాలో అన్నమాట. ఇక్కడ ఉట్టికి బదులు టోపీ ఉంటుంది.
ఈ టోపీని ‘డిక్సీ కప్’గా పిలుస్తారు. ఈ కప్‌ను చేజిక్కించుకున్న వ్యక్తి రాబోయే ఏడాది క్లాస్ లీడర్ అవుతాడు. ఈ పోటీకి ముందు... స్థూపానికి వంద కిలోల నూనెను దట్టంగా రాస్తారు. స్థూపం ఎక్కుతున్న వాళ్ల మీద పైపులతో నీళ్లు వెదజల్లుతారు. ఇటీవల జరిగిన పోటీలో రెండు గంటల 32 నిమిషాల పాటు శ్రమించి టోపీని చేజిక్కించుకున్నారు. 1950 నుంచి నిర్వహిస్తున్న ‘డిక్సీ కప్’ పోటీ వల్ల విద్యార్థుల్లో టీమ్‌వర్క్, నాయకత్వ లక్షణాలు పెంచేందుకు దోహదపడుతుందని చెబుతారు.
ఈ వార్తలు కూడా చదవండి.
భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి
Hyderabad Metro: పార్ట్-బీ మెట్రోకు డీపీఆర్ సిద్ధం
Read Latest Telangana News and National News
Updated Date - May 25 , 2025 | 09:12 AM