Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు అరుదైన బహుమతి ఇవ్వనున్న గుజరాత్ సంస్థ!
ABN, Publish Date - Jan 21 , 2025 | 12:54 AM
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్‌కు సూరత్‌కు చెందిన ఓ సంస్థ ఆయన ముఖాకృతిని చెక్కిన వజ్రాన్ని బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధమైంది. త్వరలో ట్రంప్‌కు దీన్ని అందజేస్తామని సంస్థ ప్రతినిధి తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు సూరత్‌లో (గుజరాత్) ఓ వజ్రాభరణాల సంస్థ అరుదైన బహుమతి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు కోసం ట్రంప్ ముఖాకృతిలో ఉన్న 7.5 క్యారెట్ల వజ్రాన్ని సిద్ధం చేసింది. ప్రయోగశాలలో ఈ వజ్రాన్ని రెడీ చేసినట్టు గ్రీన్ ల్యాబ్ డైమండ్స్ అనే సంస్థ తాజాగా పేర్కొంది. రూ.8.5 లక్షల విలువైన ఈ వజ్రాన్ని సిద్ధం చేసేందుకు దాదాపు మూడు నెలల సమయం పట్టిందని వెల్లడించింది (Donald Trump).
Donald Trump: తొలి ప్రసంగంలోనే తానేం చేయబోయేది చెప్పిన ట్రంప్!
‘ట్రంప్ ముఖాకృతిలో ఉన్న వజ్రాన్ని సిద్ధం చేసేందుకు మూడు నెలల సమయం పట్టింది. వజ్రాన్ని లాబ్య్‌లో రెడీ చేసి, దానిపై ట్రంప్ ముఖాకృతిని చెక్కి, పాలిష్ చేసి రెడీ చేశాము. రెండు దేశాల మధ్య సంబంధాలకు ఈ బహుమతి ఓ ప్రతీక’’ అని సంస్థ యజమానుల్లో ఒకరైన స్మిత్ పటేల్ పేర్కొన్నారు. సురత్‌కు చెందిన నిపుణులైన ఐదురుగు జెవెలర్స్ దీన్ని రెడీ చేశారని పేర్కొన్నారు. త్వరలో ట్రంప్‌కు దీన్ని బహుమతిగా ఇస్తామన్నారు.
వజ్రాల కటింగ్, పాలిషింగ్ కేంద్రంగా సూరత్ ప్రపంచప్రఖ్యాతి గాంచిన విషయం తెలిసిందే. ఇక ల్యాబ్‌లో సిద్ధం చేసిన వజ్రాలకు ఎంతో డిమాండ్ ఉంది. ఇక వజ్రాల వాణిజ్యాన్ని పెంచేందుకు భారత ప్రభుత్వం ఈ వజ్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఇక 2023 నాటి అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అప్పటి అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ల్యాబ్ గ్రోన్ డైమండ్‌ను బహుమతిగా ఇచ్చారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్
ఇక సోమవారం ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం చేసిన తొలి ప్రసంగంలోనే ట్రంప్ వలసలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
Read Latest and Internationl News
Updated Date - Jan 21 , 2025 | 12:55 AM