Share News

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Jan 20 , 2025 | 10:51 PM

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చీఫ్ జస్టిస్ ఆయనతో ప్రమాణం చేయించారు.

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా ప్రభుత్వ యంత్రాంగం, ప్రపంచ దేశాల నేతలు, వ్యాపార దిగ్గజాల సమక్షంలో క్యాపిటల్ హిల్‌ రొటుండాలో అట్టహాసంగా సాగిన కార్యక్రమంలో ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 78 ఏళ్ల ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. దేశ కోసం సర్వశక్తుూ ఒడ్డుతానంటూ బైబిల్ చేతిలో ట్రంప్ ప్రమాణం చేశారు. ట్రంప్‌కు ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు.

Updated Date - Jan 20 , 2025 | 10:59 PM