Professor uses ChatGPT: చాట్‌జీపీటీ సాయంతో ప్రొఫెసర్ బోధన.. విద్యార్థికి తిక్క రేగడంతో..
ABN, Publish Date - May 22 , 2025 | 07:44 AM
చాట్‌జీపీటీతో లెక్చర్ నోట్స్ సిద్ధం చేసుకున్న ఓ ప్రొఫెసర్ అడ్డంగా బుక్కైపోయారు. ఇది చూసి తిక్కరేగిన ఓ విద్యార్థి తాను కట్టిన ఫీజు వాపస్ ఇచ్చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: చాట్‌జీపీటీ.. విద్యాప్రపంచంలో ప్రస్తుతం ఇది రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు. చాట్‌జీపీటీపై అధికంగా ఆధారపడుతున్న విద్యార్థులు నైపుణ్యాలను నేర్చుకోలేకపోవడంతో చూసి ఎందరో టీచర్లు కలత చెందుతున్నారు. అయితే, తాజా ఉదంతంలో ఓ ప్రొఫెసర్ చాట్‌జీపీటీ సాయంతో పాఠం చెప్పేందుకు ప్రయత్నించి విద్యార్థి ఆగ్రహానికి గురయ్యారు. ప్రొఫెసర్‌పై మండిపడ్డ ఓ స్టూడెంట్ తాను కట్టిన ఫీజును తిరిగిచ్చేయాలని యూనివర్సిటీని డిమాండ్ చేశారు. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం తెగ సంచలనం రేపుతోంది.
నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. అక్కడి ప్రొఫెసర్ రిక్ ఆరోవుడ్.. చాట్‌జీపీటీ వాడొద్దని విద్యార్థులకు కండీషన్ పెట్టారు. అయితే, లెక్చర్ నోట్స్ తయారు చేసేందుకు ఆయన చాట్‌జీపీటీతో పాటు ఇతర ఏఐ మోడల్స్‌ను వినియోగించారు. ఆ నోట్స్‌లో ఏఐ చేసిన తప్పులను ఎల్లా స్టేపుల్‌టన్ అనే విద్యార్థిని గుర్తించారు. అక్షర దోషాలతో పాటు బొమ్మలు కూడా తప్పుగా ఉన్నట్టు కనిపెట్టారు. తాను క్లాస్‌లో రాసుకున్న నోట్స్‌తో పోల్చి చూసినప్పుడు ఇది బయటపడింది.
ప్రొఫెసర్‌పై ఆమె ఫైరైపోయారు. విద్యార్థులు చాట్‌జీపీటీ వాడొద్దని ఆంక్షలు విధించిన ప్రొఫెసర్ తను మాత్రం దీన్ని ఎలా వాడతారని ప్రశ్నించారు. ఇంతోటి చదువుకు వేలకు వేలు ఫీజులు యూనివర్సిటీకి కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. తాను కట్టిన ట్యూషన్ ఫీజును తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై దృష్టి సారించిన యూనివర్సిటీ అధికారులు చివరకు విద్యార్థిని డిమాండ్‌ను తోసిపుచ్చారు. మరోవైపు, ఈ అంశంపై యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది.
ఇక ప్రొఫెసర్ ఆరోవుడ్ మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. అధ్యాపకులు చాట్‌జీపీటీ వాడటంలో తప్పేమీ లేదని తెలిపారు. అయితే, తాము ఏఐని వాడుతున్న విషయాన్ని ప్రొఫెసర్లు బహిరంగ పరిచే విధానం రావాలని సూచిస్తున్నారు. జనాలు మాత్రం ఈ అంశంపై భిప్రాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పనిమనిషి బండారం బయటపెట్టిన ఫేస్‌బుక్ ఫొటో
రూ.15 వేల జరిమానా చెల్లించిన ఫ్లాట్ ఓనర్.. ఎందుకో తెలిస్తే..
25 ఏళ్ల సీనియారిటీ ఉన్న ఉద్యోగి తొలగింపు.. మైక్రోసాఫ్ట్‌పై బాధితుడి భార్య ఫైర్
ఇరుగుపొరుగు వారి ఫిర్యాదుతో బయటపడ్డ దారుణం.. వృద్ధురాలిపై పోలీసుల దర్యాప్తు
ఐఐటీ డిగ్రీని విదేశాల్లో పెద్దగా పట్టించుకోరా.. ఎన్నారై పోస్టు నెట్టింట వైరల్
Updated Date - May 22 , 2025 | 07:44 AM