Share News

IIT Tag: ఐఐటీ డిగ్రీని విదేశాల్లో పెద్దగా పట్టించుకోరా.. ఎన్నారై పోస్టు నెట్టింట వైరల్

ABN , Publish Date - May 18 , 2025 | 05:12 PM

ఐఐటీ డిగ్రీలకు విదేశాల్లో మనం ఊహించుకున్నంత గుర్తింపు ఏమీ లేదంటూ లండన్‌లో ఉంటున్న ఓ ఎన్నారై పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై జనాలు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

IIT Tag: ఐఐటీ డిగ్రీని విదేశాల్లో పెద్దగా పట్టించుకోరా.. ఎన్నారై పోస్టు నెట్టింట వైరల్
global hiring trends

ఇంటర్నెట్ డెస్క్: విదేశాల్లో పనిచేయాలనుకునే భారతీయులకు తమ ఐఐటీ డిగ్రీతో పెద్ద గుర్తింపు ఏమీ రాదంటూ ఓ ఎన్నారై చేసిన వ్యాఖ్య ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఉద్యోగాన్వేషణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ కునాల్ కుష్వాహా అనే వ్యక్తి ఈ పోస్టు పెట్టారు. జాబ్ రిఫరల్స్ కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు ముందు తాము చేసిన ప్రాజెక్టులు గురించి ప్రస్తావించాలని అన్నారు. తన రిఫరల్ కోరుతూ ఓ వ్యక్తి పంపిన మెసేజ్‌ను కూడా షేర్ చేశారు. తాను ఐఐటీలో చదువుకున్నట్టు సదరు వ్యక్తి కునాల్‌కు మెసేజ్ పెట్టారు. ఏఐ జాబ్ కోసం రిఫరల్ కావాలని అన్నారు. ఈ మేసేజ్‌ను కునాల్ యథాతథంగా షేర్ చేశారు (IIT job referrals).


‘‘ఉద్యోగాన్వేషణ ఎంత కష్టమో నాకు తెలుసు. చాలా ధైర్యం, సహనం కావాలి. రిఫరల్స్ కోరుతూ పెట్టే చిన్న చిన్న సందేశాల్లో ప్రతి పదం చాలా ముఖ్యమైనది. ఇలాంటి మెసేజీల్లో ముందు పదంగా మీరు చదువుకున్న కాలేజీని ప్రస్తావిస్తే పెద్ద ఉపయోగం ఉండదు. మీ ప్రత్యేకత చాటుకునేందుకు ఓ అమూల్యమైన అవకాశం కోల్పోయినట్టే. టాప్ ఐఐటీల్లో చదువుకున్న వారు కూడా ఉద్యోగాలు దొరకక ఇబ్బంది పడుతున్నారు’’

‘‘మీ ప్రత్యేకతను చాటి చెప్పేది మీ ప్రతిభ. మీరు గతంలో చేసిన ప్రాజెక్టులే మీ సామర్థ్యానికి కొలమానం. ప్రఖ్యాత కాలేజీలో చదివామని చెప్పుకుంటే పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఐఐటీలకు భారత్‌లో మంచి పేరు ఉంది. అయితే, విదేశీ కంపెనీల్లో రిమోట్ జాబ్ కోరుకుంటే మాత్రం ఐఐటీ డిగ్రీలకు ప్రత్యేక గుర్తింపు ఏమీ ఉండదు’’ అని చెప్పుకొచ్చారు.


ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. జనాలు తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ముందుగా తన కాలేజీ పేరు చెప్పుకున్నాడంటే అతడి ఉద్యోగ జీవితంలో చెప్పుకోదగిన విజయాలు ఏవీ లేవని భావించాలని కొందరు అన్నారు. తన బలాలను ముందుగా ప్రస్తావించడంలో తప్పేమీ లేదని మరికొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

పనిమనిషి బండారం బయటపెట్టిన ఫేస్‌బుక్ ఫొటో

రూ.15 వేల జరిమానా చెల్లించిన ఫ్లాట్ ఓనర్.. ఎందుకో తెలిస్తే..

ఇరుగుపొరుగు వారి ఫిర్యాదుతో బయటపడ్డ దారుణం.. వృద్ధురాలిపై పోలీసుల దర్యాప్తు

Read Latest and Viral News

Updated Date - May 18 , 2025 | 05:16 PM