ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పొట్టు పొట్టు కొట్టుకున్న లేడీ ప్రిన్సిపల్, లైబ్రరియన్

ABN, Publish Date - May 04 , 2025 | 03:31 PM

Principal And Librarian: జడలు పట్టుకుని లాక్కున్నారు. అక్కడే ఉన్న ఓ మహిళ వారిని పక్కకు తప్పించడానికి చూసింది.అయినా వాళ్లు వెనక్కు తగ్గలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Principal And Librarian

పిల్లలకు విద్యా బుద్దులు చెప్పి సక్రమమార్గంలో పెట్టాల్సిన గురువులే తప్పుదోవపడుతున్నారు. చదువుకున్న మూర్ఖుల్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆఖరికి లేడీ టీచర్లు కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, గవర్నమెంట్ స్కూల్‌కు చెందిన ఇద్దరు లేడీ స్టాఫ్ దారుణంగా కొట్టుకున్నారు. జుట్లు పట్టుకుని డబ్ల్యూడబ్ల్యూఈని మించి పోయి ఫైట్ చేశారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో శనివారం వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్, కర్గోనేలో ఏకలవ్య అనే ప్రభుత్వ పాఠశాల ఉంది.


ఆ పాఠశాలకు ప్రవీన దహియా ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తోంది. అదే పాఠశాలలో మధురాణి లైబ్రరియన్‌గా విధులు నిర్వర్తిస్తోంది. పనికి సంబంధించిన విషయంలో ఇద్దరికీ గొడవ మొదలైంది. అది చినికి చినికి గాలి వానలా మారింది. కొద్దిసేపటికే అది కొట్టుకునే వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు చేతులతో దాడి చేసుకున్నారు. జడలు పట్టుకుని లాక్కున్నారు. అక్కడే ఉన్న ఓ మహిళ వారిని పక్కకు తప్పించడానికి చూసింది. అయినా వాళ్లు వెనక్కు తగ్గలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


47 సెకన్లు ఉన్న ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. ఇద్దరినీ విధుల నుంచి తొలగించారు. అసిస్టెంట్ కమిషనర్ ప్రశాంత్ ఆర్య ఆఫీస్‌కు అటాచ్ చేశారు. ప్రశాంత్ ఆర్య మాట్లాడుతూ.. పనికి సంబంధించిన విషయంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగినట్లు వివరించారు. లోతైన విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక, జిల్లా కలెక్టర్ భవ్య మిట్టల్ కూడా ఈ సంఘటనపై స్పందించారు. వీలైనంత త్వరగా సంఘటనపై దర్యాప్తు జరపాలని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌ను ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

Karnataka News: తనకంటే రెండేళ్లు పెద్దదైన అమ్మాయితో ప్రేమ.. ఊహించని దారుణం..

Heavy Rains IN AP:ఏపీలో భారీ వర్షాలు.. ప్రభుత్వం అప్రమత్తం

Updated Date - May 04 , 2025 | 03:33 PM