Share News

Karnataka News: తనకంటే రెండేళ్లు పెద్దదైన అమ్మాయితో ప్రేమ.. ఊహించని దారుణం..

ABN , Publish Date - May 04 , 2025 | 02:46 PM

Karnataka News: ఈ నేపథ్యంలోనే యువతి కుటుంసభ్యులు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రీతమ్ హత్యకు ప్లాన్ చేశారు. శుక్రవారం రాత్రి ప్రీతమ్‌ను ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేశారు. అనంతరం హత్య చేశారు.

 Karnataka News: తనకంటే రెండేళ్లు పెద్దదైన అమ్మాయితో ప్రేమ.. ఊహించని దారుణం..
Karnataka News

తనకంటే వయసులో పెద్దదైన యువతిని ప్రేమించిన ఓ యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. యువతి కుటుంబసభ్యులు అతడ్ని కిడ్నాప్ చేసి మరీ హత్య చేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు రూరల్ జిల్లా, దేవణహళ్లి తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన ప్రీతమ్ అనే యువకుడు డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అతడికి కొన్నేళ్ళ క్రితం ఎంబీబీఎస్ చదువుతున్న ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.


ఆ యువతి అతడికంటే రెండు సంవత్సరాలు పెద్ద. అయినా ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. ప్రీతమ్‌కు వార్నింగ్ ఇచ్చారు. తమ కూతురి జోలికి రావద్దని అన్నారు. అయినా అతడు వారి మాటల్ని లెక్కచెయ్యలేదు. ఈ నేపథ్యంలోనే యువతి కుటుంసభ్యులు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రీతమ్ హత్యకు ప్లాన్ చేశారు. శుక్రవారం రాత్రి ప్రీతమ్‌ను ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేశారు. అనంతరం హత్య చేశారు. యువతి పిన్ని కొడుకు శ్రీకాంత్, అతడి స్నేహితులు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.


ఈ సంఘటనపై యువతి తండ్రి మాట్లాడుతూ.. ‘ నా కూతురు చిత్రదుర్గలో ఎంబీబీఎస్ చదువుతోంది. నా కూతురు ప్రేమించకుంటే చనిపోతానని అతడు లేఖ రాసి బెదిరించాడు. గత కొద్దిరోజుల నుంచి పల్లవి చాలా డబ్బులు అడుగుతూ ఉంది. నేను ఓ రోజు నా కూతురి ఫోన్ చెక్ చేశాను. ప్రీతమ్‌కు చాలా డబ్బులు పంపింది. నేను నా కూతుర్ని నిలదీశాను. పల్లవి ఫొటో అతడి దగ్గర ఉందంట. ఆ ఫొటో చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడట. నేను ఆమెను తిట్టి బుద్ధి చెప్పాను. తన సిమ్ తీసి పడేశాను. అయినా ప్రీతమ్ వదల్లేదు. చిత్రదుర్గ వెళ్లి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం నా భార్య చెల్లెలి కొడుకుకు తెలిసింది. కోపంతో అతడే ఈ హత్య చేశాడు’ అని అన్నాడు. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

సముద్రపు నాచును తినేస్తున్నారు..

Trisha: పెళ్లి గురించి బాధ లేదు..

Updated Date - May 04 , 2025 | 02:52 PM