సముద్రపు నాచును తినేస్తున్నారు..
ABN , Publish Date - May 04 , 2025 | 10:13 AM
మన దేశంలో కూడా అనేకచోట్ల సముద్ర తీరాల్లో మొదలైన నాచు సేద్యం పుంజు కుంటోంది.. ప్రభుత్వం కూడా సీ విడ్‌పైన సరికొత్త పరిశోధనలు చేస్తోంది..
ప్రపంచ మానవాళికి దొరికిన అతి చౌకైన అమృత ఆహారం ‘సీ విడ్’ అనబడే సముద్రపు నాచు మొక్క. కొన్నేళ్ల నుంచి జపనీయులు తమ సుషీ ఆహారపదార్థంలో సముద్రపు నాచును భాగం చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే రకరకాల ఆధునిక ఆహార పదార్థాల్లో, ఔషధాల్లో, ఎరువుల రూపంలో సీ విడ్ మార్కెట్ విస్తరిస్తున్నది. మన దేశంలో కూడా అనేకచోట్ల సముద్ర తీరాల్లో మొదలైన నాచు సేద్యం పుంజు కుంటోంది.. ప్రభుత్వం కూడా సీ విడ్‌పైన సరికొత్త పరిశోధనలు చేస్తోంది..
- ఇదొక నాచుమొక్క. ‘ఆంగ్లం’లో ‘సీ విడ్’ అనీ.. వాడుక భాషలో సముద్రపు నాచు అనీ పిలుస్తారు. ఉప్పు నీటి అడుగుభాగాన విస్తారంగా పెరుగుతుంది. సముద్రపు నీళ్లలోసూర్యరశ్మి ప్రసరించేచోట పుష్కలంగా పెరుగుతుంది. తీగల్లా అల్లుకుపోయే మొక్క ఇది. మనిషికి దొరికిన అతి చౌక ఆహారపదార్థం.
.
ఈ వార్తను కూడా చదవండి: తీరొక్క ‘సౌందర్యం’
- ఈ సముద్రపు నాచును అత్యంత ప్రాచీన కాలం నుంచే మనుషులు తిండిలో భాగం చేసుకున్నారు. ఎరువుగా, ఔషధంగా, జంతువులకు ఆహారంగా వాడటం మొదలైంది. 20వ శతాబ్దంలో అనేక ఆహార పరిశోధనలు జరిగాయి కాబట్టి.. సముద్రపు నాచులో అత్యంతవిలువైన పోషకాలు ఉన్నాయని నిర్దారించారు నిపుణులు. అప్పటి నుంచీ నాచుతో రకరకాల ఆహారపదార్థాల తయారీ ప్రారంభమైంది. జపాన్‌లో సుషీ అనే పదార్థంతో బాగా ప్రాచుర్యం పొందిందీ సీ విడ్.
- సీ విడ్ నీటిలో ఆకుపచ్చ, ఎరుపు ఇలా పలురంగుల్లో పెరుగుతుంది. ఎర్రటి నాచును చాకొలెట్‌మిల్క్ షేక్‌లలో ఎక్కువగా వాడతారు. ఆసియా దేశాల్లో అనేక పదార్థాల్లో ఏదో ఒక రూపంలో సీ విడ్‌ను కలిపి తినడం అలవాటు. దీనిని ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకుంది జపాన్. ఈ ఒక్క దేశంలోనే ఏటా పది నుంచి పదిహేను టన్నుల నాచు వాడకం ఉందని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పేర్కొంది. జపాన్‌లో అందరూ ఇష్టంగా తినే సుషిలో సీ విడ్ తప్పని సరి. పక్షుల లాలాజలంతో తయారయ్యే ప్రత్యేక సూప్‌లో కూడా సీ విడ్‌ను కలుపుతారు. అక్కడది ప్రత్యేకం.
- సీ విడ్ నుంచి సేకరించిన క్యారేజీనన్‌ను ఆహారపదార్థాలు, చాక్లెట్‌మిల్క్‌షేక్‌లు, చూయిం గ్‌గమ్, జామ్, జెల్లీలలో వాడతారు. ఇవన్నీ గట్టిపడేందుకు నాచు పొడి ఉపకరిస్తుంది. బేకరీ, డైరీ ఉత్పత్తులు, క్యాండీలు, సలాడ్స్, ఐస్‌క్రీమ్స్, క్రీముల తయారీలోనూ దీనిపాత్ర అమోఘం. మాంసం, చేపలను శుద్ధి చేయడానికి సీ విడ్ పనికొస్తోంది. ఇక, బీర్లు, వైన్‌ల తయారీకి కూడా వాడుతున్నారు.
- ఔషధాల తయారీలో సముద్రపు నాచు పాత్ర ప్రత్యేకమైనది. దగ్గు టానిక్‌తో పాటు దంతధావన ఉత్పత్తులు, ఉదరసంబంధిత జబ్బుల ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. ఫేసియల్ మాస్క్‌లు కూడా వచ్చేశాయి. చర్మ రుగ్మతలకు ఇది బాగా పనిచేస్తుంది. బాడీ జెల్, క్రీములు, షాంపూలు, టూత్ పేస్ట్‌లు, కండీషనర్స్ తదితర కాస్మొటిక్స్‌లలో సీ విడ్ ఉంటోంది.
- సముద్రపు ఉప్పునీటిలో పెరిగే నాచు కాబట్టి.. అత్యధిక పోషకవిలువలున్న ఎరువుగా పంటలకు పనికొస్తోంది. ఇందులోని పొటాషి యం, నైట్రోజన్, పాస్ఫరస్‌ల వల్ల అధిక దిగుబడులు వస్తున్నాయి.

- ఆహారం, ఔషధాలు, సౌందర్యసాధనాల్లోనే కాదు... పరిశ్రమల్లోనూ నాచును వాడు తున్నారు. పెయింటింగ్స్, పిగ్మెంట్స్, డైలు, ఫిని షింగ్ తయారీలో తప్పనిసరి. పేపర్, కార్డ్‌బోర్డ్, ఫిల్టర్స్, టెక్స్‌టైల్స్, చార్‌కోల్ బ్రిక్స్ లోనూ సము ద్రపు నాచు ఉండనే ఉంటోంది. ఇది పూర్తిగా పీచుపదార్థం కాబట్టి.. పేలుడు పదార్థాలు, బాణాసంచా తయారీలో కీలకంగా మారింది.
- మనదేశంలో 840 రకాల నాచు సముద్రంలో లభిస్తోంది. ఇందులో 51 శాతం ఎరుపు, 26 శాతం ఆకుపచ్చరకాలు. గోవా సముద్రతీర ప్రాంతాల్లో పెరిగే నాచు తినడానికి వీలున్నదని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. గుజరాత్, తమిళనాడు, అండమాన్, నికోబార్ దీవుల్లో పెరిగే సీ విడ్ కూడా నాణ్యమైనదే. మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో సీ విడ్‌ను కొందరు రైతులు సముద్ర తీరాల్లో సాగుచేస్తున్నారు.
- సీ విడ్‌ను నాచుమొక్కలే కదాని తీసిపారే యలేం. వీటిలో పోషకాలు పుష్కలం. ఒకకప్పు నాచులో 45 గ్రాముల క్యాలరీలు, 5 గ్రాముల ప్రొటీన్, 1 గ్రాము కొవ్వులు, 8 గ్రాముల కార్బో హైడ్రేట్లు, పీచుపదార్థం, విటమిన్లు అయిన ఫోలేట్, రైబోఫ్లేవియన్, థియామిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కెలతో పాటు ఇనుము, రాగి, అయోడిన్, మెగ్నీషియం, క్యాల్షియం, పాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. ఆరోగ్యానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్స్ అదనం
ఈ వార్తలు కూడా చదవండి
Gold Silver Rate Today: షాకింగ్..రూ.7 వేలు పెరిగిన వెండి..కానీ గోల్డ్ మాత్రం..
Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్
Car Tragedy News: కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు
ప్రమాద బాధిత కుటుంబానికి కేటీఆర్ అండ
Read Latest Telangana News and National News