ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Deadbody Funny Video: రోడ్డు పక్కన పడి ఉన్న అనాథ శవం.. తరలించాలని దగ్గరికి వెళ్లగా..

ABN, Publish Date - Aug 14 , 2025 | 08:21 PM

రోడ్డు పక్కన బురద నీటి పక్కనే తెల్లటి దుప్పటి కప్పి ఉండడం స్థానికులు చూశారు. అందులో మనిషి మృత దేహం ఉన్నట్లు అనిపించడంతో వెంటనే అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. శవాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

కొన్నిసార్లు మన కళ్లతో చూసింది నిజం కాకపోవచ్చు. మనం అనుకున్నది ఒకటైతే.. అక్కడ మరోటి జరుగుతుంటుంది. కొన్నిసార్లు మన కళ్లను మనమే నమ్మలేని విధంగా విచిత్రాలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా సంఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డు పక్కన అనాథ శవం పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే శవాన్ని తరలించాలని దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా.. ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

వింతలు, విశేషాలు, అద్భుతాలకు సోషల్ మీడియా వేదికగా మారుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఇలాంటి వింత ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ఒకటి తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన బురద నీటి పక్కనే తెల్లటి దుప్పటి కప్పి ఉండడం స్థానికులు చూశారు. అందులో మనిషి మృత దేహం (dead body) ఉన్నట్లు అనిపించడంతో వెంటనే అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చేంత వరకూ ఎవరూ దాని దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు. ఇంతలో అంబులెన్స్, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఈ శవం ఎవరిదో చూసేందుకు జనం భారీగా గుమిగూడారు. అక్కడికి వచ్చిన పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది.. శవాన్ని తరలించేందుకు దగ్గరికి వెళ్లారు. అయితే తీరా దగ్గరికి వెళ్లి తెల్లటి సంచిని పక్కకు తీయగానే షాకింగ్ సీన్ కనిపించింది. గాఢనిద్రలో ఉన్న ఓ వ్యక్తి.. కళ్లు నులుముకుంటూ పైకి లేచి, ‘ప్రశాంతంగా పడుకుని ఉంటే.. ఎవరు నన్ను డిస్టర్బ్ చేసింది’.. అంటూ ఎగాదిగా చూశాడు. దీంతో అప్పటిదాకా అది శవం అనుకున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలీసు, అంబులెన్స్ సిబ్బంది నవ్వుకుంటూ పక్కకు వెళ్లిపోయారు.

ఒక్కసారిగా చుట్టూ జనాన్ని చూసిన ఆ వ్యక్తి.. ఏం జరుగుతోందో అర్థం కాక.. పైకి లేచి, సంచిని చేతిలోకి తీసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ ఘటన చూసిన వారంతా పగలబడి నవ్వుకున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు గానీ.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అనాథ శవం అనుకుని.. చివరకు అవాక్కయ్యారుగా’.. అంటూ కొందరు, ‘అతన్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వరా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 1.19 లక్షలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 08:21 PM