ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. మేకప్ మాయ అంటే ఇదే.. వధువు చేసిన పని తెలిస్తే షాకవకుండా ఉండలేరు..

ABN, Publish Date - Jun 15 , 2025 | 07:03 PM

వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. వధూవరులు వివాహ వేదిక మీద కుర్చీలో కూర్చుని ఉన్నారు. వరుడు నల్లగానే ఉన్నాడు. కానీ, వధువు మొహం మాత్రం తెల్లగా మెరిసిపోతోంది.

Bride and Groom

సాధారణంగా అమ్మాయిలు మేకప్ (Makeup) అంటే ఎంతో ఇష్టపడతారు. తమను తాము అందంగా చూపించుకునేందుకు ఇష్టపడతారు. ఇక, పెళ్లి (Wedding) అంటే అమ్మాయిల మేకప్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టం. పెళ్లి వీడియోలు, ఫొటోల్లో అందంగా కనిపించాలని తహతహలాడుతుంటారు. పెళ్లి మేకప్ కోసం గంటలు గంటలు కేటాయిస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ వధువుకు (Bride) వేసిన మేకప్ చూస్తే మాత్రం నివ్వెరపోవాల్సిందే.

meinkiakaruu అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. వధూవరులు వివాహ వేదిక మీద కుర్చీలో కూర్చుని ఉన్నారు. వరుడు నల్లగానే ఉన్నాడు. కానీ, వధువు మొహం మాత్రం తెల్లగా మెరిసిపోతోంది. అయితే కెమెరా ఫోకస్ చేస్తే అసలు విషయం బయటపడింది. ఆ వధువు చేతులు కారు నలుపు రంగులో ఉన్నాయి. దీంతో ఆమె మొహాన్ని తెల్లగా మార్చడానికి ఏ రేంజ్‌లో మేకప్ వేశారో అర్థం చేసుకోవచ్చు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా వీక్షించారు. రెండు వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. నల్లగా కనిపించడం అంత పెద్ద నేరమా? అని ఒకరు ప్రశ్నించారు. ఎవరి కోసం ఆమె అంతగా మేకప్ వేసుకుంది అని మరొకరు కామెంట్ చేశారు. ఆమె మొహం మీద కేజీకి పైగా మేకప్ ఉండి ఉంటుందని మరొకరు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

Japan: లంచ్ బ్రేక్‌లో ఇంటికొచ్చిన యువతి.. ఆమె బెడ్‌పై అర్ధనగ్నంగా బాస్.. తర్వాతేం జరిగిందంటే..

Snake Eagle video: ఈ పాము జీవిత పాఠం నేర్పుతోంది.. డేగను ఎలా మట్టికరిపించిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 15 , 2025 | 08:58 PM