Share News

Snake Eagle video: ఈ పాము జీవిత పాఠం నేర్పుతోంది.. డేగను ఎలా మట్టికరిపించిందో చూడండి..

ABN , Publish Date - Jun 15 , 2025 | 04:49 PM

ముంగిస, డేగ వంటివి పాములను వేటాడేందుకు ఉత్సాహం చూపిస్తాయి. ఆ జంతువులతో కూడా పాములు చివరి వరకు పోరాడతాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ పాము తన ప్రాణం కోసం డేగతో పోరాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

Snake Eagle video: ఈ పాము జీవిత పాఠం నేర్పుతోంది.. డేగను ఎలా మట్టికరిపించిందో చూడండి..
Snake Eagle fight

పామును (Snake) చూస్తే ప్రతి ఒక్కరూ భయపడతారు. విష సర్పాల జోలికి వెళితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. అయితే కొన్ని జంతువులు పామును చాలా సులభంగా వేటాడతాయి. ముంగిస, డేగ వంటివి పాములను వేటాడేందుకు ఉత్సాహం చూపిస్తాయి. ఆ జంతువులతో కూడా పాములు చివరి వరకు పోరాడతాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ పాము తన ప్రాణం కోసం డేగ (Eagle)తో పోరాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది (Viral Video).


@AMAZlNGNATURE అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ డేగ ఓ పామును పట్టుకుంది. ఆ పాము తలను కాలితో పట్టుకుని ముక్కుతో దానిని చంపేందుకు ప్రయత్నిస్తోంది. మొదట పాము నుంచి ఎలాంటి ప్రతిఘటనా లేదు. అయితే తన తోకతో మెల్లిగా ఆ డేగను చుట్టేసింది. తన బలమంతా ఉపయోగించి ఆ డేగకు ఊపిరాడకుండా చేసేసింది. దీంతో ఆ డేగ కింద పడిపోయింది. డేగతో పోరాటంలో పాము చూపించిన ఓపిక, వ్యూహం అద్భుతంగా ఉన్నాయి.


ఏదైనా ప్రమాదం వాటిల్లినపుడు కంగారుపడకుండా, ధైర్యం కోల్పోకుండా పక్కా వ్యూహంతో ఎదురుదాడి చేయాలని పాము సూచిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కొన్ని కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఒకరిని బలహీనంగా భావించి ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని ఓ యూజర్ కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Japan: లంచ్ బ్రేక్‌లో ఇంటికొచ్చిన యువతి.. ఆమె బెడ్‌పై అర్ధనగ్నంగా బాస్.. తర్వాతేం జరిగిందంటే..


Crocodile Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చిరుత ముందు మొసలి బలం ఏమైందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 15 , 2025 | 04:49 PM