Japan: లంచ్ బ్రేక్‌లో ఇంటికొచ్చిన యువతి.. ఆమె బెడ్‌పై అర్ధనగ్నంగా బాస్.. తర్వాతేం జరిగిందంటే..
ABN , Publish Date - Jun 15 , 2025 | 04:07 PM
జపాన్‌లోని ఫుకుయోకా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆఫీస్ లంచ్ బ్రేక్ సమయంలో ఓ యువతి కొన్ని వస్తువులు తీసుకోవడానికి తన ఇంటికి వచ్చింది. బెడ్రూమ్ తలుపు తీసేసరికి ఆమె మంచంపై బాస్ లో దుస్తులతో పడుకుని ఉన్నాడు.
జపాన్ (Japan)లోని ఫుకుయోకా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆఫీస్ లంచ్ బ్రేక్ సమయంలో ఓ యువతి కొన్ని వస్తువులు తీసుకోవడానికి తన ఇంటికి వచ్చింది. బెడ్రూమ్ తలుపు తీసేసరికి ఆమె మంచంపై బాస్ (Boss) లో దుస్తులతో పడుకుని ఉన్నాడు. అతడిని చూసి ఆమె షాకైంది. వెంటనే తలుపులు వేసి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడైన బాస్‌ను అరెస్టు చేశారు. ఈ కేసు జపాన్ వ్యాప్తంగా సంచలనంగా మారింది (Viral News).
20 ఏళ్ల ఆ యువతిని ఆమె 47 ఏళ్ల బాస్ ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఆమె గురించి మరింత తెలుసుకోవాలనుకున్నానని, అందుకే ఆమె ఇంట్లోకి రహస్యంగా ప్రవేశించానని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. అంతకు ముందు కూడా ఆ అమ్మాయికి తెలియకుండా ఆ ఇంట్లోకి వెళ్లినట్టు చెప్పాడు. అతను అమ్మాయి ఇంట్లోకి ఎలా ప్రవేశించాడో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు? అతను ఆమె గదిలో ఏవైనా నిఘా పరికరాలను ఏర్పాటు చేశాడా? అనేది కూడా దర్యాఫ్తు చేస్తున్నారు. ఏదేమైనా ఆ బాస్ తీరుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
జపాన్‌లో ఇటీవలి కాలంలో ఇలాంటి వేధింపులు ఎక్కువవుతున్నాయి. మహిళా ఉద్యోగిణులు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. బాస్‌ల వేధింపులు తట్టుకోలేక ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. 'నేను నా ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నాను' వంటి హ్యాష్ ట్యాగ్‌లతో తమ బాధాకర కథలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Test: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫొటోలో 995ల మధ్యనున్న 999ను 9 సెకెన్లలో కనిపెట్టండి..
Crocodile Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చిరుత ముందు మొసలి బలం ఏమైందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..