ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Theft Funny Video: నేలపై పడిపోయిన ఫోన్.. తీసుకోవాలని చూడగా షాక్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN, Publish Date - May 04 , 2025 | 08:42 PM

రద్దీగా ఉన్న ప్రాంతంలో రోడ్డు పక్కన కొత్త స్మార్ట్ ఫోన్ కింద పడి ఉంటుంది. దాన్ని చూసిన వారంతా ఎలాగైనా ఎత్తుకెళ్లాలని ప్రయత్నిస్తారు. అయితే చివరకు ఏం జరిగిందో చూసి.. అంతా తెగ నవ్వుకుంటున్నారు..

చోరీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు దొంగలు తెలివిగా చోరీలు చేయడం చూస్తుంటాం. మరికొందరు కళ్లెదురుగా ఉంటూనే కళ్లగప్పి చోరీలు చేస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్ని షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ చోరీకి సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ ఫోన్‌ను కొట్టేయడం అంత ఈజీ కాదు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న ప్రాంతంలో రోడ్డు పక్కన కొత్త స్మార్ట్ ఫోన్ (smart phone) కింద పడి ఉంటుంది. దాన్ని చూసిన వారంతా ఎలాగైనా ఎత్తుకెళ్లాలని ప్రయత్నిస్తారు. ముందుగా ఓ వ్యక్తి ఆ ఫోన్ పక్కనే నిలబడతాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. ముందుగా తన చేతిలోని గుడ్డ ముక్కను ఫోన్‌పై పడేస్తాడు.

Woman Viral Video: గాలిలో విహరిస్తున్న యువతి.. సడన్‌గా షాకింగ్ సీన్.. చివరకు చూస్తే..


ఆ తర్వాత గుడ్డతో పాటూ ఫోన్‌ను కూడా (Phone theft attempt) తీసుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఎంత ప్రయత్నించినా ఫోన్ మాత్రం చేతిలోకి రాదు. దీంతో చేసేదేమీలేక వట్టి చేతులతో వెళ్లిపోతాడు. ఆ తర్వాత మరొకరు కూడా ఫోన్ తీసుకునేందుకు వింత ట్రిక్ ప్రయోగిస్తారు. తమ చేతిలోని వస్తువును కింద పడేస్తారు. ఆ తర్వాత ఆ వస్తువుతో పాటూ ఫోన్‌ను కూడా తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఆ ఫోన్‌ను తీసుకోవాలని ఎంత ప్రయత్నించినా చేతిలోకి రాదు. దీంతో ఉసూరుమంటూ వెళ్లాల్సి వస్తుంది. మూడో సారి ఓ వ్యక్తికీ ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది. దీంతో అనుమానం వచ్చి కాలితో ఆ ఫోన్‌ను అటూ, ఇటూ కదిపి పరిశీలిస్తాడు.

Monkey Funny Video: సెల్ఫీ తీసుకునే ముందు ఆలోచించాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..


ఆ ఫోన్‌ను నేలకు గమ్‌తో అంటించినట్లు అర్థం చేసుకుని, ఫూల్స్ అయ్యామురో బాబోయ్.. అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొందరు ఇలా ప్రాంక్ చేశారని తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఫోన్‌ను చోరీ చేయడం అసాధ్యం’’.. అంటూ కొందరు, ‘‘ప్రాంక్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: మేడమైన అమ్మాయిని చూడగానే ఐఫోన్ ఇచ్చేశాడు.. తర్వాత పైకి చూసి ఖంగుతిన్నాడు..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 08:42 PM