ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gigantic Jet: వామ్మో.. పవర్‌ఫుల్ మెరుపు.. ఇలాంటిది మీరెప్పుడూ చూసుండరు

ABN, Publish Date - Aug 13 , 2025 | 02:20 PM

తుఫాను మేఘాల పైభాగం నుంచి అంతరిక్షంలోకి వ్యాపించే జైగాంటిక్ జెట్ మెరుపు ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మెరుపులు ఎలా ఏర్పడతాయనే అంశంపై నాసా తన తాజా ఆర్టికల్‌లో సుదీర్ఘ వివరణ ఇచ్చింది.

NASA Nichole Ayers Gigantic Jet Photo

ఇంటర్నెట్ డెస్క్: భూమ్మీద ఉండే మనుషులు సాధారణ మెరుపులను మాత్రమే చూడగలరు. కానీ మేఘాలపై నుంచి అంతరిక్ష వైపు దాదాపు 60 కిలోమీటర్ల మేర నిట్టనిలువుగా వ్యాపించే అసాధారణ మెరుపులు కంట పడటం చాలా అరుదు. జైగాంటిక్ జెట్స్ అని పిలిచే ఈ మెరుపులను విమానాల్లో వెళ్లే వాళ్లు, వ్యోమగాములు మాత్రమే చూడగలరు. అదృష్టం బాగుంటే అవి కెమెరా కంటికి కూడా చిక్కుతాయి. అలాంటి ఓ జైగాంటిక్ జెట్ గురించి తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) పంచుకున్న విశేషాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఏమిటీ జైగాంటిక్ జెట్స్

మెరుపు అంటే విద్యుత్ ప్రవాహమని అందరికీ తెలిసిందే. ఇక సాధారణంగా మనం చూసే మెరుపులు తక్కవ ఎత్తులో మేఘాల మధ్య ఏర్పడతాయి. మరికొన్ని మేఘాల నుంచి భూమి మీదకు పిడుగు రూపంలో దూసుకొస్తాయి. కానీ జైగాంటిక్ జెట్స్ వీటికి కాస్త భిన్నమైనవి. తుఫాను మేఘాల పైపొరల్లో మొదలయ్యే ఈ విద్యుత్ ప్రవాహాలు భూమి వైపు కాకుండా ఏకంగా వాతావరణం పైపొరల్లోకి దూసుకుపోతాయి. 20 కిలోమీటర్ల ఎత్తున ఉన్న మేఘాల్లో పుట్టి దాదాపు 80 కిలోమీటర్ల ఎత్తు వరకూ నిట్టనిలువుగా వ్యాపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చూడటానికి అద్భుతంగా ఉండే ఈ మెరుపులు అత్యంత అరుదుగా మాత్రమే కెమెరా కంటికి చిక్కుతాయి. నాసా వ్యోమగామి నికోల్ ఆయర్.. జులైలో ఇలాంటి ఓ జైగాంటిక్ జెట్ ఫొటో తీశారు. అప్పట్లో ఇది జనాలను తెగ ఆశ్చర్యపరిచింది.

అయితే, నికోల్ ఆయర్ తొలుత తను చూసింది జైగాంటిక్ జెట్ కాకపోవచ్చని సందేహించారు. వాతావరణం పైపొరల్లో ఏర్పడే స్ప్రైట్ అనే కాంతి పుంజం అయి ఉంటుందని అనుకున్నారు. కానీ ఇది జైగాంటిక్ జెట్ అని తాజాగా రూఢీ అయినట్టు నాసా వెల్లడించింది. ఈ విశేషాలను నెట్టింట పంచుకుంది. వాతావరణం పైపొరల్లో సంభవించే పరిణామాలను తెలుసుకునేందుకు స్ప్రిట్రాక్యులర్ అనే ప్రాజెక్టు ఉంది. పౌరులు తమకు కనిపించిన వాతావరణ అద్భుతాల ఫొటోలు ఈ ప్రాజెక్టులో పంచుకోవచ్చు. ముఖ్యంగా వాతావరణం పైపొరలైన ట్రోపోస్ఫియర్, ఐయోనోస్పియర్‌లో విద్యుత్ ప్రవాహ స్వభావాలను తెలుసుకునేందుకు జైగాంటిక్ జెట్స్, స్ప్రైట్‌‌ల అధ్యయనం ఉపయోగ పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఈ అద్భుత దృశ్యాన్ని మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

ఇవీ చదవండి:

లండన్‌లోని భారతీయ రెస్టారెంట్‌లో షాకింగ్ ఘటన.. వీడియో వైరల్

నాలుగు దశాబ్దాలుగా రోజూ 10 గంటల పాటు భిక్షాటన.. ఇతడి ఆస్తి ఎంతో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Aug 13 , 2025 | 02:49 PM