Share News

Mumbai Beggar: నాలుగు దశాబ్దాలుగా రోజూ 10 గంటల పాటు భిక్షాటన.. ఇతడి ఆస్తి ఎంతో తెలిస్తే..

ABN , Publish Date - Aug 10 , 2025 | 03:19 PM

నాలుగు దశాబ్దాలుగా వీధుల్లో రోజూ భిక్షాటన చేస్తూ కోట్లు కూడబెట్టిన ఓ యాచకుడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

Mumbai Beggar: నాలుగు దశాబ్దాలుగా రోజూ 10 గంటల పాటు భిక్షాటన.. ఇతడి ఆస్తి ఎంతో తెలిస్తే..
Mumbai beggar Income

ఇంటర్నెట్ డెస్క్: వీధుల్లో భిక్షాటన చేసే వారికి ఐదో పదో వేసి ఊరుకుంటాం. ఆ తరువాత విషయాన్ని అక్కడితో మర్చిపోతాం. వారి పరిస్థితులు, ఆర్థిక స్థితిగతుల గురించి చాలా మంది పెద్దగా ఆలోచించరు. ఇలాంటి వారందరికీ ఆశ్చర్యం కలిగించే ఓ ఉదంతం ముంబైలో వెలుగు చూసింది. నాలుగు దశాబ్దాలుగా భిక్షాటన చేసిన ఓ వ్యక్తి ప్రస్తుతం కోటీశ్వరుడైపోయాడు. రెండు ఫ్లాట్‌లకు ఓనర్‌గా మారడమే కాకుండా తన పిల్లలను కూడా సెటిల్ చేశాడు.

ముంబైకి చెందిన భరత్‌‌కు భిక్షాటనే ప్రధాన వృత్తి. నాలుగు దశాబ్దాలుగా అతడు వీధుల్లో అడుక్కుంటూ జీవిస్తున్నాడు. రోజుకు 10-12 గంటల పాటు వీధిల్లోనే గడిపేస్తాడు. హాలిడేలు, వారాంతాలు వంటివాటిని అతడు అస్సలు పట్టించుకోడు. ఇలా రోజుకు రూ.2000 నుంచి రూ.2500 సంపాదించే అతడు ముంబైలో రెండు ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నాడు. శాలరీ ఉద్యోగులకు మించి ఆర్జిస్తూ తన సంతానాన్ని మంచి చదవులు చదివించి సెటిల్ కూడా చేశాడు.


భరత్ పేద కుటుంబంలో పుట్టాడు. అతడి చిన్నతనం అంతా కష్టాల్లోనే గడిచింది. కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా ఆ కుటుంబం అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. మంచి చదువులు, ఉద్యోగం వంటి అవకాశాలు ఏమీ లేకపోవడంతో భరత్ చివరకు భిక్షాటన వైపు మళ్లాడు.

ముంబై సీఎస్‌టీ స్టేషన్ వద్ద ఎక్కువగా కనిపించే అతడి ఆస్తుల విలువ రూ.7.5 కోట్లకు పైగానే ఉంటుందట. భిక్షాటనతో వచ్చిన డబ్బును జాగ్రత్తగా మదుపు చేసి చివరకు కోట్ల ఆస్తిని సొంతం చేసుకున్నాడు. థానేలో అతడికి రెండు కమర్షియల్ షాపులు ఉన్నాయి. వాటి ద్వారా నెలకు రూ.30 వేల రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది. అంతేకాకుండా, ముంబైలో రెండు ఫ్లాట్‌లను కూడా అతడు అద్దెకిచ్చి ఆదాయం పొందుతుంటాడు. పిల్లలను మంచి చదువులు చదివించడంతో వాళ్లు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు.

లైఫ్‌లో ఇంత హ్యాపీగా ఉన్నా అతడు ఇప్పటికీ భిక్షాటన చేస్తూ ఉండటం విశేషం. ఏళ్ల తరబడి అనుసరిస్తున్న జీవన విధానాన్ని వదులుకోలేకపోవడమో, మూలాలను మర్చిపోకూడదన్న భావమో తెలీదు కానీ ఇప్పటికీ అతడు ముంబై స్టేషన్ వద్ద కనిపిస్తుంటాడు.


ఇవీ చదవండి:

వామ్మో జపాన్.. రైలు 35 సెకెన్లు ఆలస్యం అయినందుకు టిక్కెట్‌ డబ్బులు వాపస్

కనీస బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ పెంపు.. ఐసీఐసీఐ బ్యాంకుపై విమర్శలు

Read Latest and Viral News

Updated Date - Aug 10 , 2025 | 05:46 PM