Ladies Special Train: స్పెషల్ ట్రైన్లో పొట్టుపొట్టు కొట్టుకున్న అమ్మాయిలు
ABN, Publish Date - Jun 20 , 2025 | 06:15 PM
Ladies Special Train: ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ ఇద్దరు అమ్మాయిల మధ్య సీటు విషయంలో గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలివానలా తయారైంది.
బస్సుల్లో, రైళ్లలో సీట్ల కోసం గొడవలు జరగటం అన్నది అత్యంత సాధారణమైన విషయం. అయితే, కొన్ని సార్లు ఆ గొడవలు హద్దులు దాటుతూ ఉంటాయి. గాయాల పాలు అయ్యేలా కొట్టుకునే వరకు వెళుతూ ఉంటాయి. సాధారణంగా మగవాళ్లు గొడవలు పడ్డప్పుడు.. గాయాలు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆడవాళ్లు గొడవలు పడితే ఆ పరిస్థితి ఉండదు. కానీ, మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీలో ఆడవాళ్ల కోసం మాత్రమే కేటాయించిన రైలులో.. ఇద్దరు ఆడాళ్లు సీట్ల కోసం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గాయాలు అయ్యేలా కొట్టుకున్నారు.
ఈ ఘటన ముంబై లోకల్ ట్రైన్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆడవాళ్ల కోసం కేటాయించిన ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ ఇద్దరు అమ్మాయిల మధ్య సీటు విషయంలో గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలివానలా తయారైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలెట్టారు. అలా ఓ అమ్మాయి మరో అమ్మాయిని రక్తం వచ్చేలా కొట్టింది. అయినా ఆ గొడవ ఆగలేదు. పక్కనే ఉన్న వారు ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఆ అమ్మాయిలు గొడవ ఆపలేదు.
కొన్ని నిమిషాల పాటు ఆ గొడవసాగింది. అక్కడే ఉన్న ఓ లేడీ దాన్నంతా వీడియో తీసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. ఆ గొడవపై ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూశామని, నిజానిజాలు అన్వేషిస్తున్నామని స్పష్టం చేశారు. ఇక, గొడవ చర్చ్‌గేట్ నుంచి విరార్ వెళుతున్న లేడీస్ స్పెషల్ లోకల్ ట్రైన్‌లో జరిగినట్లు తేలింది.
ఇవి కూడా చదవండి
మెట్రో రైలులో అలజడి సృష్టించిన పాము..
కాబోయే కోడలితో ఇంటి నుంచి పారిపోయిన వ్యక్తి..
Updated Date - Jun 20 , 2025 | 07:11 PM