Share News

UP Plot Twist: కాబోయే కోడలితో ఇంటి నుంచి పారిపోయిన వ్యక్తి..

ABN , Publish Date - Jun 20 , 2025 | 03:52 PM

UP Plot Twist: తండ్రికి, తనకు కాబోయే భార్యకు మధ్య ఎఫైర్ ఉందని షకీల్ కొడుక్కు అనుమానం వచ్చింది. షబీనాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో షకీల్ ఫ్యామిలీని షాక్‌కు గురి చేసే నిర్ణయం తీసుకున్నాడు.

UP Plot Twist: కాబోయే కోడలితో ఇంటి నుంచి పారిపోయిన వ్యక్తి..
UP Plot Twist

ఉత్తర ప్రదేశ్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కాబోయే కోడలితో ఇంట్లోంచి పారిపోయాడు. పక్కా ప్లాన్‌తో కుటుంబం పరువు తీశాడు. మొదటగా.. ఓ అమ్మాయితో తన కొడుక్కి పెళ్లి కుదిర్చాడు. ఇంట్లో వాళ్లకు ఆ అమ్మాయి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయాలని చూశాడు. కాబోయే కోడలితో ప్రేమ వ్యవహారం నడిపాడు. అంతటితో ఆగకుండా ఆమెతో ఇంటినుంచి పారిపోయాడు. కాబోయే కోడలిని తన భార్యగా చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి భార్య, కొడుకు షాక్ అయ్యారు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా ఊరు మొత్తం తెలియటంతో బయట తిరగలేని పరిస్థితి వచ్చింది.


సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, రామ్‌పూర్ జిల్లా, బన్‌సంగలి గ్రామానికి చెందిన షకీల్‌ తన కొడుక్కు షబీనా అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేశాడు. షకీల్ కొడుకు మైనర్ కావటంతో భార్య, ఇతర కుటుంబసభ్యులు పెళ్లిని వ్యతిరేకించారు. షకీల్ మాత్రం వెనక్కు తగ్గలేదు. భార్య, కొడుకును చావగొట్టాడు. బలవంతంగా వారిని పెళ్లికి ఒప్పించాడు. షకీల్ భార్య, కొడుకు చెబుతున్న దాని ప్రకారం.. షకీల్ అర్థరాత్రి వరకు గంటలు, గంటలు షబీనాతో ఫోన్ కాల్స్ మాట్లాడేవాడు. ఇదేంటని అడిగితే ఇద్దరినీ బాగా కొట్టేవాడు.


ఈ నేపథ్యంలోనే తండ్రికి, తనకు కాబోయే భార్యకు మధ్య ఎఫైర్ ఉందని షకీల్ కొడుక్కు అనుమానం వచ్చింది. షబీనాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో షకీల్ ఫ్యామిలీని షాక్‌కు గురి చేసే నిర్ణయం తీసుకున్నాడు. కొడుక్కు కాబోయే భార్యతో ఇంటినుంచి పారిపోయాడు. ఇంటినుంచి పోతూ.. బంగారు నగలు, నగదు తీసుకెళ్లిపోయాడు. ఇంటినుంచి వెళ్లిపోయిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం షకీల్ భార్యా, కొడుక్కి తెలిసి షాక్ అయిపోయారు. ఊర్లో వారికి కూడా విషయం తెలియటంతో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడింది.


ఇవి కూడా చదవండి

వర్షాకాలం.. వీటిని అస్సలు తినకండి..

శరీరంలో టెంపరేచర్‌కు ఓ లిమిట్.. ఈ లక్ష్మణ రేఖ దాటితే..

Updated Date - Jun 20 , 2025 | 04:08 PM