Viral Video: మెట్రో రైలులో అలజడి సృష్టించిన పాము..
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:47 PM
Viral Video: లేడీస్ కోచ్‌లో పాము ఉందంటూ ప్రచారం జరిగింది. దీంతో కోచ్‌లో అలజడి మొదలైంది. భయపడిపోయిన ఆడవాళ్లు అటు, ఇటు పరుగులు తీశారు. కొంతమంది అయితే, సీట్ల మీదకు ఎక్కి నిల్చున్నారు.
మెట్రో రైళ్లలో తరచుగా వింత విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది జనం తమ ప్రవర్తనతో కలకలం రేపుతూ ఉంటారు. ఈ సారి మాత్రం ఓ పాము వంతు వచ్చింది. మెట్రో రెైలులో ఓ పాము కలకలం సృష్టించింది. లేడీస్ కోచ్‌లో పాము ఉందని ప్రచారం జరగటంతో.. అందులోని ఆడవాళ్లు భయంతో బిక్కచచ్చిపోయారు. ఏం చేయాలో తెలియక సీట్లపైకి ఎక్కి నిలబడ్డారు. ఈ సంఘటన ఢిల్లీ మెట్రో రైలులో గురువారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
గురువారం ఢిల్లీ మెట్రో రైలులోని లేడీస్ కోచ్‌లో పాము ఉందంటూ ప్రచారం జరిగింది. దీంతో కోచ్‌లో అలజడి మొదలైంది. భయపడిపోయిన ఆడవాళ్లు అటు, ఇటు పరుగులు తీశారు. కొంతమంది అయితే, సీట్ల మీదకు ఎక్కి నిల్చున్నారు. గట్టిగా కేకలు వేయటం మొదలెట్టారు. ఓ అమ్మాయి ఏకంగా ఎమర్జెన్సీ బటన్ నొక్కి రైలును ఆపేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..
‘ఓసారి సరిగా చూడండి.. వచ్చింది పాము అయి ఉండదు. మా బాస్ అయి ఉంటాడు. వాడు చచ్చిపోతే నాకు శాలరీ రాదు’.. ‘నేను కూడా ఆ కోచ్‌లో ఉన్నాను. ఆ కోచ్‌లో ఉన్న ఓ మహిళ బల్లి తోకను చూసి భయపడింది. ఎవరో అది పాము అంటూ ప్రచారం మొదలెట్టారు. అంతే తప్ప అక్కడ పాము లేదు’..‘కెమెరా మ్యాన్ నెవర్ డై.. అంత భయంకరమైన పరిస్థితిలోనూ వీడియో తీశారు’ అంటూ స్పందిస్తున్నారు. ఇక, ఈ సంఘటనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ అధికారులు ఇంకా స్పందించలేదు.
ఇవి కూడా చదవండి
కాబోయే కోడలితో ఇంటి నుంచి పారిపోయిన వ్యక్తి..
బైకుపై వెళుతుండగా విషాదం..ఆస్పత్రికి తీసుకెళ్లగా షాక్..