ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Street Dog: నువ్వసలు మనిషివేనా.. మూగ జీవిపై అంత దారుణమా..

ABN, Publish Date - Jun 27 , 2025 | 08:44 PM

Street Dog: ఓ కుక్క ఆ టీ షాపు దగ్గరలో పడుకుని ఉంది. అది ఎవ్వరినీ ఏమీ అనలేదు. దాని మానాన అది నిద్రపోతూ ఉంది. అయితే, ఆ టీ షాపు యజమాని ఆ కుక్కపై వేడి వేడి నీళ్లు పోశాడు.

Street Dog

మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు నశిస్తోంది. మూగ జీవాల పట్ల అకారణంగా దారుణంగా ప్రవర్తించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా, టీ అమ్ముకునే వ్యక్తి ఓ వీధి కుక్కతో అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. అది ఏ తప్పు చేయకపోయినా.. దానిపై వేడి నీళ్లు పోసి కాల్చాడు. వేడి నీళ్ల కారణంగా ఆ కుక్క చర్మం బాగా కాలిపోయింది. గాయాలతో నరకం చూస్తోంది. ఈ సంఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..

ముంబై, మలద్ ఈస్ట్, కురర్ విలేజ్, సాయి బాబా గుడి దగ్గర టీ షాపు ఉంది. కొద్దిరోజుల క్రితం ఓ కుక్క ఆ టీ షాపు దగ్గరలో పడుకుని ఉంది. అది ఎవ్వరినీ ఏమీ అనలేదు. దాని మానాన అది నిద్రపోతూ ఉంది. అయితే, ఆ టీ షాపు యజమాని ఆ కుక్కపై వేడి వేడి నీళ్లు పోశాడు. దీంతో అది తీవ్రంగా గాయపడింది. గాయాల కారణంగా సరిగా నడవలేకపోతోంది. వీధి కుక్కపై వేడి నీళ్లు పోసిన ఈ ఘటన జంతు ప్రేమికుడు సుధీర్ కుదల్కర్ దృష్టికి వెళ్లింది.

అతడు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో..‘మనం మనల్ని మనుషులం అని చెప్పుకుంటే.. మనుషుల్లా ప్రవర్తించాలి. ఓ అమాయకమైన కుక్కను కాల్చటం అన్నది దారుణం. చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాల్సిందే. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయం జరగాల్సిందే’ అని పేర్కొన్నాడు. ఆ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ చాయ్ వాలాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పాపం వృద్ధులు.. అలా చేయడానికి మనసెలా వచ్చింది..

73 ఏళ్ల బామ్మ కడుపులో.. 30 ఏళ్ల పిండం

Updated Date - Jun 27 , 2025 | 09:13 PM