Share News

Calcified Fetus: 73 ఏళ్ల బామ్మ కడుపులో.. 30 ఏళ్ల పిండం

ABN , Publish Date - Jun 27 , 2025 | 06:00 PM

Calcified Fetus: నాన్ ఆస్థటిక్ థింగ్స్ అనే ఎక్స్ ఖాతా ఓ మహిళ సీటీ స్కానింగ్ రిపోర్టుకు సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ‘ఇవి 73 ఏళ్ల ఓ వృద్ధురాలికి సంబంధించిన సీటీ స్కాన్ ఫొటోలు. ఆమె కడుపులో 30 ఏళ్ల పిండం ఉన్నట్లు బయటపడింది’ అని రాసుకొచ్చింది.

Calcified Fetus: 73 ఏళ్ల బామ్మ కడుపులో.. 30 ఏళ్ల పిండం
Calcified Fetus

ఐదు అంగుళాల ఫోన్.. ప్రపంచం మొత్తాన్ని మన చేతిలో పెట్టేస్తోంది. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రపంచం నలుమూలలా జరిగే వింత, విచిత్రమైన సంఘటనల గురించి ఇంట్లో కూర్చుని తెలుసుకోగలుగుతున్నాం. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటిలో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా, నాన్ ఆస్థటిక్ థింగ్స్ అనే ఎక్స్ ఖాతా ఓ మహిళ సీటీ స్కానింగ్ రిపోర్టుకు సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్ చేసింది.


‘ఇవి 73 ఏళ్ల ఓ వృద్ధురాలికి సంబంధించిన సీటీ స్కాన్ ఫొటోలు. ఆమె కడుపులో 30 ఏళ్ల పిండం ఉన్నట్లు బయటపడింది’ అని రాసుకొచ్చింది. ఆ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 23 మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకుంది. ఆ ఫొటోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇదో మెడికల్ మెరాకిల్’..‘కాన్పు సందర్భంగా ఆ పిండం కడుపులోనే చనిపోయింది. బహుశా ఆమె కడుపులో ఇద్దరు ఉండి ఉంటారు. ఒకరు బయటకు వచ్చారు. మరొకరు కడుపులోనే చనిపోయారు. దాన్ని బయటకు తీయలేదు.


తల్లికి ఏమీ కాకుండా ఆ పిండం మొత్తం కాల్షియంతో చుట్టుకుపోయింది. అందుకే ఇప్పటికీ ఏమీ కాకుండా ఉంది’.. ‘దేవుడు చేసే వింతల్లో ఇది కూడా ఒకటి. చాలా అద్భుతంగా ఉంది కదూ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం ఆ ఫొటోలు ఫేక్ అని కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫొటోలు, జరిగిన సంఘటన ఫేకా.. కాదా అన్న దానిపై క్లారిటీ లేదు.

old-calcified-fetus.jpg


ఇవి కూడా చదవండి

కరెంట్ విషయంలో గొడవ.. కర్రలతో చావగొట్టిన సిబ్బంది..

భర్త హత్యకు ప్రతీకారం.. శపథం చేసి మరీ చంపింది..

Updated Date - Jun 27 , 2025 | 06:18 PM