Share News

Power Cut Complaint: కరెంట్ విషయంలో గొడవ.. కర్రలతో చావగొట్టిన సిబ్బంది..

ABN , Publish Date - Jun 27 , 2025 | 05:03 PM

Power Cut Complaint: గొడవ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రవీంద్ర, సచిన్, విపిన్, సోహిత్‌లను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Power Cut Complaint: కరెంట్ విషయంలో గొడవ.. కర్రలతో చావగొట్టిన సిబ్బంది..
Power Cut Complaint

అదో విలాసవంతమైన హౌసింగ్ కాంప్లెక్స్. ఏమైందో ఏమో తెలీదు కానీ, కొన్ని గంటల పాటు ఆ హౌసింగ్ కాంప్లెక్స్‌లో కరెంట్ పోయింది. గంటలు గడుస్తున్నా కరెంట్ రాకపోవటంతో అక్కడ ఉండేవారు హౌసింగ్ కాంప్లెక్స్ మెయింటెనెన్స్ సిబ్బందికి ఫోన్ చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అపార్ట్‌మెంట్స్‌లో ఉండే వారు సిబ్బంది దగ్గరకు వెళ్లారు. ఆ సిబ్బంది సమాధానం చెప్పకపోగా.. అందరినీ చావగొట్టింది. ఆ సిబ్బంది దాడిలో కొందరు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్‌‌లో గురువారం చోటుచేసుకుంది.


పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, గ్రేటర్ నోయిడాలో ఎకో విలేజ్ 1 సొసైటీ అనే హౌసింగ్ కాంప్లెక్స్ ఉంది. గురువారం ఆ హౌసింగ్ కాంప్లెక్స్‌లో కరెంట్ పోయింది. 3 గంటలు అవుతున్నా కరెంట్ రాలేదు. దీంతో హౌసింగ్ కాంప్లెక్స్ నివాసులు మెయింటెనెన్స్ సిబ్బందికి ఫోన్ చేశారు. సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కాంప్లెక్స్ నివాసులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా.. మెయింటెనెన్స్ సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో కాంప్లెక్స్ నివాసులకు కోపం వచ్చింది.


ఓ గుంపుగా ఏర్పడి సిబ్బంది దగ్గరకు వెళ్లారు. కరెంట్ కోత గురించి నిలదీశారు. మెయింటెనెన్స్ సిబ్బంది అప్పుడు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. మెయింటెనెన్స్ సిబ్బంది.. కాంప్లెక్స్ నివాసులపై దాడికి దిగారు. కర్రలతో చావగొట్టారు. చిన్న పిల్లల ముందే వారిపై చేతులు, కాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది గాయపడ్డారు.


ఇక, గొడవ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రవీంద్ర, సచిన్, విపిన్, సోహిత్‌లను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు మెయింటెనెన్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

అసలు వ్యక్తులను గుర్తించి శిక్షించాల్సిందే: కాంగ్రెస్

భర్త హత్యకు ప్రతీకారం.. శపథం చేసి మరీ చంపింది..

Updated Date - Jun 27 , 2025 | 05:18 PM