Share News

Phone Tapping: అసలు వ్యక్తులను గుర్తించి శిక్షించాల్సిందే: కాంగ్రెస్

ABN , Publish Date - Jun 27 , 2025 | 04:43 PM

Phone Tapping: చట్టానికి వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత దేవరాజు గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తన ఇంటిలో అక్రమంగా సోదాలు చేశారని అన్నారు. ఎలక్షన్ టైమ్‌లో తన ఫోన్ ట్యాప్ అయినట్టు అనుమానం వచ్చిందని చెప్పుకొచ్చారు.

Phone Tapping: అసలు వ్యక్తులను గుర్తించి శిక్షించాల్సిందే: కాంగ్రెస్
Phone Tapping Case

హైదరాబాద్, జూన్ 27: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు దేవరాజు గౌడ్‌ (Congress Leader Devaraju Goud) సిట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. 2023 ఎన్నికల సమయంలో దేవరాజు గౌడ్ ఫోన్ ట్యాప్ అయ్యింది. దీంతో సిట్ అధికారుల నుంచి సమాచారం అందడంతో వాంగ్మూలం ఇచ్చేందుకు ఈరోజు (శుక్రవారం) జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయనికి దేవరాజు వచ్చారు. కాంగ్రెస్ నేత నుంచి సిట్ అధికారులు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. సిట్‌కు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం దేవరాజు మీడియాతో మాట్లాడారు.


సిట్ పిలుపు మేరకు వాంగ్మూలం ఇవ్వడానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. 2023 ఎలక్షన్ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కామారెడ్డి జిల్లా నుంచి పోటీ చేశారని... అదే సమయంలో తాను కూడా ఆ జిల్లా గెలుపు బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. తమ ప్రణాళికలు తెలుసుకునేందుకే ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తన ఇంటిలో అక్రమంగా సోదాలు చేశారని అన్నారు. ఎలక్షన్ టైమ్‌లో తన ఫోన్ ట్యాప్ అయినట్టు అనుమానం వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ టైంలో తనతో పాటు కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు వ్యక్తుల్ని గుర్తించి శిక్షించాలని దేవరాజు గౌడ్ డిమాండ్ చేశారు.


మరోవైపు చేవెళ్ల ఎంపీ, బీజేపీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఈరోజు సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. 2023 నవంబర్‌లో ఎంపీ ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్ అధికారులు.. వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సమాచారం అందజేశారు. దీంతో ఈరోజు ఉదయం ఎంపీ.. సిట్ కార్యాలయానికి రాగా.. ఆయన స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు. మునగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు చూపించారని.. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక తన ఫోన్‌ట్యాప్ అయినట్లు కన్ఫామ్ అయ్యిందని ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

ఫోన్ ట్యాపింగ్.. రోజుకొకరి విచారణ.. ఇదేమన్న డైలీ సీరియలా: ఎంపీ రఘునందన్

బేసిన్‌కు బాసిన్‌కు తేడా తెలియని సీఎం రేవంత్.. హరీష్ ఎద్దేవా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 27 , 2025 | 04:43 PM