Mother Bears Emotional Struggle: ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
ABN, Publish Date - Aug 09 , 2025 | 06:55 AM
Mother Bears Emotional Struggle: పిల్ల ఎలుగు తీవ్రంగా గాయపడింది. నడవలేని స్థితితో రోడ్డుపై పడిపోయింది. పాపం తల్లి ఎలుగు బంటి పిల్లను అలా చూసి విలవిల్లాడిపోయింది. రోడ్డుపై వాహనాలు వస్తుండటంతో పిల్లను రోడ్డు దాటించడానికి చాలా ఇబ్బంది పడింది.
బిడ్డల మరణం కంటే ఓ తల్లికి భరించలేని బాధ ఏముంటుంది. తన ప్రాణాలు పోయినా పర్లేదు.. బిడ్డలు క్షేమంగా ఉంటే చాలు అనుకుంటుంది తల్లి. పిల్లల కోసం ఎంత కష్టానికైనా వెనుకాడదు. వారికి ఏ చిన్న సమస్య వచ్చినా విలవిల్లాడిపోతుంది. అలాంటిది బిడ్డకు ఏమన్నా అయితే తట్టుకోగలదా.. కచ్చితంగా లేదు. కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా ఇదే వర్తిస్తుంది. తాజాగా, తల్లి ఎలుగు బంటితో కలిసి రోడ్డు దాటుతున్న పిల్ల ఎలుగు బంటి ప్రమాదానికి గురైంది.
రోడ్డుపై కదలలేని స్థితిలో ఉన్న బిడ్డను కాపాడుకోవటానికి, రోడ్డు దాటించడానికి తల్లి ఎలుగు బంటి చాలా కష్టాలే పడింది. అయితే, పిల్ల ఎలుగు బంటి గాయాల కారణంగా చనిపోయింది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి ఓ తల్లి ఎలుగు బంటి తన రెండు పిల్లలతో కలిసి షాహ్‌దోల్ జిల్లాలోని బరీ డ్రేన్ సమీపంలో జోహ్‌పారు - జైత్‌పూర్ రోడ్డు దాటుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ వాహనం ఒక పిల్ల ఎలుగు బంటిని ఢీకొట్టింది.
పిల్ల ఎలుగు తీవ్రంగా గాయపడింది. నడవలేని స్థితితో రోడ్డుపై పడిపోయింది. పాపం తల్లి ఎలుగు బంటి పిల్లను అలా చూసి విలవిల్లాడిపోయింది. రోడ్డుపై వాహనాలు వస్తుండటంతో పిల్లను రోడ్డు దాటించడానికి చాలా ఇబ్బంది పడింది. చాలా సేపు పిల్ల కోసం అక్కడే ఉండిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పిల్ల ఎలుగు బంటిని చికిత్స కోసం తీసుకెళ్లారు. కానీ, అది మాత్రం బతకలేదు. చికిత్స పొందుతూ చనిపోయింది. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
జబల్‌పూర్ భూగర్బంలో బంగారు కొండ!
గ్రీన్ హైడ్రోజన్ నౌకల దిశగా భారత్ తొలి అడుగు
Updated Date - Aug 09 , 2025 | 06:59 AM