Geen Hydrogen: గ్రీన్ హైడ్రోజన్ నౌకల దిశగా భారత్ తొలి అడుగు
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:36 AM
భారత్‌లో మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. 2019లో నిర్వహించిన అధ్యయనంలో 45 ఏళ్లు అంతకంటే
న్యూఢిల్లీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత నౌకల అభివృద్ధిలో దేశం ముందడుగు వేస్తోందని కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయాన, జలమార్గాల మంత్రి సర్భానంద సోనోవాల్ అన్నారు. పర్యావరణానికి అనుకూలంగా, నావికా రవాణా రంగాన్ని నూతన దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో హైడ్రోజన్ ఇంధనాన్ని వినియోగించే నౌకలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభలో ఎంపీ కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. స్వదేశీ సాంకేతిక పరిజ్జానంతో పూర్తిగా హైడ్రోజన్ ఇంధన కణాలతో నడిచేలా కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ సంస్థలు చెరొక నౌకను నిర్మిస్తున్నాయని తెలిపారు. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద 2025-26 వరకు రూ.115 కోట్ల బడ్జెట్‌ను కేటాయించామని వెల్లడించారు.