Monkey Funny Viral Video: కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ABN, Publish Date - Aug 12 , 2025 | 08:59 PM
కోతులన్నీ కలిసి వీధిలోకి వచ్చి, ఇళ్లల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంతలో ఓ వ్యక్తి వాటిని చూసి, దారిలో ఉన్న కర్ర తీసుకుని తరిమికొట్టేందుకు ప్రయత్నం చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
కోతుల బెడద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్ను మూసి తెరచిలోగా ఇంట్లోకి దూరి ఆహార పదార్థాలు, వస్తువులను ఎత్తుకెళ్తుంటాయి. కొందరికి కోతుల బెదడ పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. ఈ క్రమంలో చాలా మంది కోతులను తరిమేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కోతుల గుంపును కర్రతో తరిమికొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కోతులన్నీ కలిసి వీధిలోకి వచ్చి, ఇళ్లల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంతలో ఓ వ్యక్తి వాటిని చూసి, దారిలో ఉన్న కర్ర తీసుకుని (Man attacked monkeys with stick) తరిమికొట్టేందుకు ప్రయత్నం చేశాడు. కర్రతో కొట్టడంతో కోతులు పారిపోయి.. ఓ ఇంటి ఆవరణలోకి దూరాయి.
ఆ వ్యక్తి వాటిని వదలకుండా ప్రహరీ గోడ ఇవతలి వైపు నుంచి వాటిని కొట్టేందుకు ప్రయత్నించాడు. కోతులు కూడా అతడిపైకి ఎగబడేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినా అతను చాకచక్యంగా తప్పించుకుంటూ కర్రతో బాదుతున్నాడు. అయితే ఇంతలో ఓ కోతి ఇంటిపై నుంచి ఒక్కసారిగా అతడిపై దూకి, కిందకు తోసేసి పారిపోతుంది. అయితే అతను ఇసుకలో పడిపోవడంతో ఎలాంటి గాయాలూ కావు. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది.
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కోతులతో WWE ఫైట్ చేశాడుగా’.. అంటూ కొందరు, ‘కోతి ప్రతీకారం మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 1.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..
ప్రియురాలి అత్యుత్సాహం.. రెండో అంతస్తులో పరుగెత్తుకుంటూ రావడంతో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Aug 12 , 2025 | 08:59 PM