ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mirchi Gang: రెచ్చిపోయిన మిర్చీ గ్యాంగ్.. కంట్లో కారం చల్లి..

ABN, Publish Date - Aug 11 , 2025 | 07:03 AM

Mirchi Gang: స్కూటీలపై నుంచి దిగిన వెంటనే ఓ షాపులోకి ప్రవేశించారు. ఆ వెంటనే ఓ సభ్యుడు షాపు యజమాని కంట్లో కారం చల్లాడు. డబ్బుల డ్రాయర్ దగ్గరకు వెళ్లాడు.

Mirchi Gang

దేశ రాజధాని ఢిల్లీలో మిర్చీ గ్యాంగ్ అలజడి సృష్టిస్తోంది. కంట్లో కారం చల్లి దోపిడీలకు పాల్పడుతోంది. చుట్టూ జనాలు ఉన్నా ఏ మాత్రం భయపడకుండా పబ్లిక్‌గా దొంగతనాలు చేస్తోంది. తాజాగా, మిర్చీ గ్యాంగ్ ఓ షాపులో దోపిడీకి పాల్పడింది. షాపు యజమాని కంట్లో కారం చల్లి డబ్బులు దోచేసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మిర్చీ గ్యాంగ్ స్కూటీలపై ఈ బ్లాక్‌లోకి వచ్చింది.

ఆ ఏరియాలోకి వచ్చీ రాగానే మిర్చీ గ్యాంగ్ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. స్కూటీలపై నుంచి దిగిన వెంటనే ఓ షాపులోకి ప్రవేశించారు. ఆ వెంటనే ఓ సభ్యుడు షాపు యజమాని కంట్లో కారం చల్లాడు. డబ్బుల డ్రాయర్ దగ్గరకు వెళ్లాడు. దాన్ని బయటకు తీసి షాపు బయట ఉన్న వాళ్లకు అందించాడు. కంట్లో కారం పడ్డా షాపు యజమాని వెనక్కు తగ్గలేదు. మిర్చీ గ్యాంగును అడ్డుకోవడానికి చూశాడు. వృద్ధుడు కావటం, దానికి తోడు కంట్లో కారం పడ్డం వల్ల ఆయన మిర్చీ గ్యాంగ్ సభ్యులను అడ్డుకోలేకపోయాడు.

పైగా వాళ్లు కత్తులతో బెదిరించటంతో పట్టుకోలేకపోయాడు. ఆ గ్యాంగ్ అక్కడినుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. చుట్టూ జనం ఉన్నా కూడా ఆ గ్యాంగ్‌ను ఏమీ చేయలేకపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక, వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అక్కడ అంతమంది ఉన్నారు. ఒక్కరు కూడా ఆపడానికి రాలేదు. ఏం మనుషులో’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రజనీ సినిమా కోసం సాఫ్ట్‌వేర్‌ సంస్థ సెలవు

400 కోట్లతో పేదలకు 10 వేల ఇళ్లు

Updated Date - Aug 11 , 2025 | 07:19 AM