Share News

Businessman KGF Babu: 400 కోట్లతో పేదలకు 10 వేల ఇళ్లు

ABN , Publish Date - Aug 10 , 2025 | 05:27 AM

తన తల్లి ఆశయాన్ని నెరవేర్చేందుకు బెంగళూరు నగర పరిధిలో రూ.400 కోట్లతో 10 వేల ఇళ్లను పేదలకోసం నిర్మించనున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త కేజీఎఫ్‌ బాబు (యూసుఫ్‌ షరీఫ్‌) వెల్లడించారు.

Businessman KGF Babu: 400 కోట్లతో పేదలకు 10 వేల ఇళ్లు

  • తల్లి ఆశయం కోసం కేజీఎఫ్‌ బాబు నిర్ణయం

  • సహకరించాలని ప్రభుత్వ అధికారులకు లేఖ

బెంగళూరు, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): తన తల్లి ఆశయాన్ని నెరవేర్చేందుకు బెంగళూరు నగర పరిధిలో రూ.400 కోట్లతో 10 వేల ఇళ్లను పేదలకోసం నిర్మించనున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త కేజీఎఫ్‌ బాబు (యూసుఫ్‌ షరీఫ్‌) వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో ఇప్పటికే బీబీఎంపీ చీఫ్‌ కమిషనర్‌ మహేశ్వరరావు, ఇతర అధికారులకు లేఖలు పంపామని తెలిపారు. గడిచిన శాసనసభ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు పేదలకు ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చానని, అందుకు అనుగుణంగానే ప్రాజెక్టును ప్రారంభించదలిచానని పేర్కొన్నారు. ఆ రూ. 400 కోట్లు తమ అనుబంధ సంస్థల నిధులనే ఉపయోగిస్తామని వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తికి బీబీఎంపీ, ఐటీ, నగర పోలీసు శాఖలు సహకరించాలని కోరారు. ఉమ్రా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు అనుబంధంగా ఉమ్రా డెవలపర్స్‌, అఫ్నాన్‌ కన్‌స్ట్రక్షన్స్‌, జామ్‌ జామ్‌ బిల్డర్స్‌, జుమేరా కన్‌స్ట్రక్షన్స్‌, జై డెవలపర్స్‌ వంటి కంపెనీలు తమకు అనుబంధంగా ఉన్నాయని తెలిపారు.

Updated Date - Aug 10 , 2025 | 05:28 AM