Yuno Aqua Care Company: రజనీ సినిమా కోసం సాఫ్ట్‌వేర్ సంస్థ సెలవు
ABN , Publish Date - Aug 10 , 2025 | 06:32 AM
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాను తొలిరోజే వీక్షించేందుకు అనువుగా తమ సిబ్బందికి ఈనెల 14న సెలవు ఇస్తున్నట్లు యూనో ఆక్వా కేర్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రకటించింది.
చెన్నై, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాను తొలిరోజే వీక్షించేందుకు అనువుగా తమ సిబ్బందికి ఈనెల 14న సెలవు ఇస్తున్నట్లు ‘యూనో ఆక్వా కేర్’ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రకటించింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్పట్టు, మాట్టుదావని, ఆరపాళయంలో ఉన్న తమ శాఖల సిబ్బంది వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అలాగే, రజనీకాంత్ సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘రజనిజం’ వేడుకల నేపథ్యంలో అనాథ, వృద్ధాశ్రమాల్లో మిఠాయిలు పంపిణీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది.