Minor Lies On Railway: రీల్స్ పిచ్చి.. పట్టాలపై పడుకున్న బాలుడు.. చివరకు..
ABN, Publish Date - Jul 07 , 2025 | 06:45 AM
Minor Lies On Railway: ఆ వీడియోను బాలుడు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిది. దీంతో వారు సీరియస్‌గా స్పందించారు.
సోషల్ మీడియాలో ఫేమస్ కావాలన్న పిచ్చితో కొంతమంది ప్రాణాలకు తెగిస్తున్నారు. పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. తక్కువ కాలంలో ఫేమస్ అయిపోవాలన్న ఉద్దేశ్యంతో ప్రాణాలు బలి చేసుకున్న వారు కూడా లేకపోలేదు. తాజాగా, ఓ బాలుడు ఇన్‌స్టారీల్స్ కోసం తన ప్రాణాలకు తెగించాడు. ఏకంగా రైలు పట్టాలపై పడుకున్నాడు. ఈ సంఘటన ఒరిస్సాలోని బౌద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒరిస్సాలోని బౌద్ జిల్లా, పూరునాపానీ గ్రామానికి చెందిన 12 ఏళ్ల కుర్రాడు ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇన్‌స్టాలో ఫేమస్ కావాలన్న ఉద్దేశ్యంతో తన మిత్రులతో కలిసి ఓ దారుణమై నిర్ణయం తీసుకున్నాడు. జూన్ 29వ తేదీన వారంతా గ్రామానికి సమీపంలోని రైలు పట్టాల దగ్గరకు వెళ్లారు. ఓ బాలుడు పట్టాల మధ్యలో పడుకున్నాడు. రైలు వేగంగా వచ్చి అతడి మీదనుంచి వెళ్లిపోయింది. అదృష్టం బాగుండి అతడకి ఏమీ కాలేదు. మరో బాలుగు దీన్నంతా వీడియో తీశాడు.
ఆ వీడియోను బాలుడు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిది. దీంతో వారు సీరియస్‌గా స్పందించారు. వీడియో ఆధారంగా బాలురను గుర్తించారు. వారిని, వారి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైలు పట్టాలపై పిచ్చి పిచ్చి పనులు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పెట్రోకెమికల్స్ రంగంలోకి అదానీ
Updated Date - Jul 07 , 2025 | 12:35 PM