Neredu is Good: నేరేడు ప్రయోజనాలెన్నో
ABN , Publish Date - Jul 07 , 2025 | 04:15 AM
నేరేడు పళ్ల సీజన్ వచ్చింది. నల్లగా నిగనిగలాడుతూ చూడగానే తినేయాలనిపించే ఈ పళ్ల వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు...
నేరేడు పళ్ల సీజన్ వచ్చింది. నల్లగా నిగనిగలాడుతూ చూడగానే తినేయాలనిపించే ఈ పళ్ల వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
నేరేడు పళ్లలోని జాంబోలిన్, జాంబోసిన్ అనే ఫైటో కెమికల్స్ ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. దాంతో రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
ఈ పళ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.
నేరేడు పళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఈ పళ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
వీటిలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తాయి.
నేరేడు పళ్లలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.
వీటిలోని పొటాషియం, కాల్షియంలు ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
నేరేడు పళ్లలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అలాగే మాడు మీద ఇన్ఫెక్షన్లను తగ్గించి, శిరోజాల పెరుగుదలకు సహాయపడతాయి.
వీటిలోని విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు.. మచ్చలు, గాయాలను తగ్గించి చర్మం మెరిసేలా చేస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం
డిజిటల్ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ
Read Latest Telangana News And Telugu News