Share News

Cyber Security: సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Jul 06 , 2025 | 05:15 AM

మెరుగైన ఉపాధి అవకాశాలు గల సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్‌ అకాడమి ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ డైరెక్టర్‌ విమలారెడ్డి ప్రకటించారు.

Cyber Security: సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం

బర్కత్‌పుర, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మెరుగైన ఉపాధి అవకాశాలు గల సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్‌ అకాడమి ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ డైరెక్టర్‌ విమలారెడ్డి ప్రకటించారు. సైబర్‌ సెక్యూరిటీ, ఎథికల్‌ హాకింగ్‌లో పీజీ, డిప్లొమా కోర్సులకు ఆన్‌లైన్‌లో శిక్షణ అందించి, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్లను ప్రదానం చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 78931 41797 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలని విమలారెడ్డి కోరారు.


నా మాటలను వక్రీకరిస్తే సహించను: అనిరుధ్‌రెడ్డి

జడ్చర్ల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పెద్ద కాంట్రాక్టర్లు చంద్రబాబు కోవర్టులని తాను అన్నానని, తన మాటలను వక్రీకరిస్తే సహించేదిలేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని బనకచర్ల ప్రాజెక్టు అంశంలో చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారని తాను అన్నానని, నాయకుల గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తాను మాట్లాడిన వీడియో చూడకుండానే కొందరు విపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబు కోవర్టుగా తాను పరోక్షంగా వ్యాఖ్యానించినట్లు విపక్షనేత పేర్కొనడం ఆక్షేపణీయమని అన్నారు. తాను మాట్లాడిన వీడియో చూసిన తర్వాతే మాట్లాడాలని, చూడకుండా మాట్లాడటం సబబుకాదని హితవు పలికారు. వివాదంలోకి ముఖ్యమంత్రిని లాగొద్దని కోరారు.

Updated Date - Jul 06 , 2025 | 05:15 AM