ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Microsoft Layoffs: 25 ఏళ్ల సీనియారిటీ ఉన్న ఉద్యోగి తొలగింపు.. మైక్రోసాఫ్ట్‌పై బాధితుడి భార్య ఫైర్

ABN, Publish Date - May 19 , 2025 | 12:10 PM

మైక్రోసాఫ్ట్‌లో 25 ఏళ్లుగా పనిచేసిన తన భర్త సడెన్‌గా ఉద్యోగం కోల్పోవడంపై ఆవేదన చెందిన ఆయన భార్య నెట్టింట తన గోడు వెళ్లబోసుకుంది. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Microsoft layoffs controversy

ఇంటర్నెట్ డెస్క్: మైక్రోసాఫ్ట్‌లో 25 ఏళ్లుగా పనిచేస్తున్న తన భర్తను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఓ మహిళ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మైక్రోసాఫ్ట్ ఇటీవల చేపట్టిన లేఆఫ్స్‌లో భాగంగా సీనియర్ ఉద్యోగి అయిన ఆమె భర్త జాబ్ కోల్పోయారు. ఆయన పుట్టిన రోజు మరి కొద్ది రోజుల్లో ఉందనగా జాబ్ పోగొట్టుకున్నారు. దీంతో, ఆయన భార్య నెట్టింట తన ఆవేదన పంచుకుంది.

‘‘నా భర్త ఆ సంస్థలో 25 ఏళ్ల పాటు పనిచేశారు. సడెన్‌గా ఆయనను జాబ్‌లోంచి తీసేశారు. ఆయన 48వ పుట్టిన రోజే ఆఫీసులో చివరి రోజు. ఓ కంప్యూటర్ ఆల్గోరీథమ్ ఆయనను తొలగించేందుకు సిఫార్సు చేసింది. నా భర్తకు ఆటిజం, మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధులు ఉన్నాయి. అయినా పెద్దగా సెలవులు తీసుకునే వారే కాదు. సెలవు పెట్టిన రోజు కూడా ఇంటి నుంచి పని చేసేవారు’’


‘‘వారానికి 60 గంటలకు పైగానే జాబ్ చేసేవారు. మాకు పిల్లలు లేరు. దీంతో, క్రిస్మస్, థాంక్స్‌గివింగ్ లాంటి పండగల్లో సహోద్యోగులు సెలవు పెట్టాల్సి వస్తే తాను విధులు నిర్వహించేవారు. ఏరోజూ ప్రమోషన్లు గానీ, జీతాలు పెంచాలని కానీ కోరలేదు. సంస్థకు వచ్చే సమస్యలను పరిష్కరించడంపైనే దృష్టి పెట్టేవారు. మాకు ఎవరి జాలీ అవసరం లేదు. నిస్వార్థంగా పనిచేసిన వారికి ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో చెప్పాలనే ఈ పోస్టు పెడుతున్నా’’ అని అన్నారు.

కాగా, మైక్రోసాఫ్ట్‌కు చెందిన మరో సీనియర్ ఉద్యోగి, స్టార్టప్ ఏఐ విభాగం డైరెక్టర్ గాబ్రియేలా ది కెరోజ్ కూడా లేఆఫ్స్‌లో భాగంగా జాబ్ పోగొట్టుకున్నారు. జాబ్ కోల్పోవడం విచారం కలిగించిందని అన్నారు.


రాబోయే ఏఐ భవిష్యత్తును అందిపుచ్చుకునేందుకు తొలగింపులు చేపడుతున్నట్టు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. సంస్థలో పనిచేస్తున్న వారిలో సుమారు 3శాతం మంది అంటే.. 6 వేల మందిని తొలగించింది. మధ్యస్థాయి మేనేజ్‌మెంట్‌లో ఉన్న వారిని ప్రధానంగా తొలగించింది. రోజువారి పనులను ఏఐకి అప్పగించి, ఉద్యోగులు ప్రధాన అంశాలపై దృష్టిపెట్టేలా చర్యలు తీసుకుంది.

ఇవి కూడా చదవండి:

పనిమనిషి బండారం బయటపెట్టిన ఫేస్‌బుక్ ఫొటో

రూ.15 వేల జరిమానా చెల్లించిన ఫ్లాట్ ఓనర్.. ఎందుకో తెలిస్తే..

ఇరుగుపొరుగు వారి ఫిర్యాదుతో బయటపడ్డ దారుణం.. వృద్ధురాలిపై పోలీసుల దర్యాప్తు

ఐఐటీ డిగ్రీని విదేశాల్లో పెద్దగా పట్టించుకోరా.. ఎన్నారై పోస్టు నెట్టింట వైరల్

Read Latest and Viral News

Updated Date - May 19 , 2025 | 12:15 PM