ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jugaad Funny Video: లైటు వెలుతురులో స్నానం చేయడం చూశాం గానీ.. ఏకంగా లైటుతోనే..

ABN, Publish Date - Aug 14 , 2025 | 06:15 PM

ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వినూత్న ప్రయోగాలను చూసి బాగా ఇన్‌స్పైర్ అయినట్లున్నాడు. తాను కూడా ఏదో ఒక వింత ప్రయోగం చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం పాత బల్బ్‌తో..

సోషల్ మీడియాలో వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. చాలా మంది ఇళ్లలోని వస్తువులతో వింత వింత ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. కొందరు కూలర్‌ను కూరగాయల స్టోర్ చేసేందుకు వాడితే.. మరికొందరు కుక్కర్‌ను వంట చేయడానికి బదులుగా ఐరన్ చేయడానికి వాడుతుంటారు. ఇంకొందరైతే.. గ్యాస్ స్టవ్‌ను ఏకంగా స్నానాల షవర్‌లా వాడడం కూడా చూశాం. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ వ్యక్తి బల్బ్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘బాల్బ్ బాతింగ్ అంటే ఇదేనేమో’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వినూత్న ప్రయోగాలను చూసి బాగా ఇన్‌స్పైర్ అయినట్లున్నాడు. తాను కూడా ఏదో ఒక వింత ప్రయోగం చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం పాత బల్బ్‌తో (Old Bulb) అతను చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు.

బాత్‌రూంలో బల్బ్ ఉండడం కామన్.. అయితే అదే బల్బ్ షవర్‌లా మారితే ఎలా ఉంటుందీ.. వినేందుకు వింతగా ఉంది కదా. ఈ వ్యక్తి ఈ ప్రయోగాన్ని చేసి చూపించాడు. తన ఇంట్లో పక్కన పడేసిన పాత బల్బ్‌ను తీసుకుని, దానిపై చిన్న చిన్న రంధ్రాలు చేశాడు. ఆ తర్వాత దానికి పైప్‌ జాయింట్ చేసి.. (Man used bulb as Shower) దాని మరో చివరను కొళాయికి తగిలించాడు. బల్బ్‌ను షవర్ తరహాలో గోడకు ఫిట్ చేశాడు. ఫైనల్‌గా కొళాయి ఆన్ చేయగానే నీళ్లన్నీ బల్బ్ గుండా షవర్ తరహాలో కిందకు దూకుతున్నాయి.

ఇలా బల్బ్‌ను షవర్ బాత్ కోసం వాడిన ఇతడి అతి తెలివిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘బల్బ్ బాతింగ్ అంటే ఇదేనేమో’.. అంటూ కొందరు, ‘బల్బ్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 06:15 PM